పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అంకము


నీకుభర్తంగూర్చి సౌఖ్యము గలుగజేయును. నీవుసుఖ ముగనుందువు.

తార:-(ఇంచుకదు:ఖము నభినయించి గద్గదస్వరముతో) మమ్ములనువిడిచి నాకు సౌఖ్యమా? మీపాదసేవలేని సౌఖ్యము స్వర్గసౌఖ్యమయినను నాకువలదు. అయ్యా! ఒకవేళ మీసేవచేయుటకు నేను యోగ్యురాలనుగాననియా....?

శ్రీధర:-అయ్యో! అయ్యో! ఇటుతగునా? అట్టికల్మషము, అట్టికలత, నను చేరకుండుగాక! అమ్మానీయట్టి సాధ్వీమణి సేవనొందుటకు నాకు పూర్వజన్మపు సుకృత్రముండవలెనమ్మ! నీవు! నీవు! నీప్రాణము, నాసంపద, నాదైర్యము, నాభక్తి, నావైబవము,నీదీక్ష, తారా! నాస్వర్గమేనీవు, తారా! నీవుయౌనశృంగార వతియు....

తార:-ఏమట్లు ఊరకనిలచితిరి?

శ్రీధర:-తారా! యౌవనమిట్టిదియని....

తార:-(వేగముగ) యౌవనము మీపాదధూళిసమము. (సమీపించి హస్తమును స్పృశించును)

శ్రీధర:-(కనువిచ్చి తారను చూచును) తారా! నీవుయౌవనశృంగార వనదేవతవు. అయిన (కోపముతో) ప్రకృతిపాపసమాజమున.....

తార:-అయ్యా! ఇదియా సమయము సమాజపు దుస్ధితులనువర్ణించుటకు? జరుగవలైనకార్యముల చూడవలదా?

శ్రీధర;- తారా! చచ్చినవారికి మార్గముచూపుట మనపనికాదు. బ్రదికినవారికి మార్గముచూపుటయే మనపని. చచ్చినవారి సౌఖ్యము చావులేనట్టి ఆ దేవదేవుడే చూచికొనును. బ్రతికియున్నవారల సౌఖ్యము మనమించుక గమనించిన చాలును. స్వర్గమునందు, కైలాసమునందు, వైకుంఠమునందు, ఆరోగ్యసంఘములకు పట్టణపారిశుద్ధ్య సంఘములకు, భోజనములకు, విందులకు, సౌఖ్యములకు, ఏమియు కొఱతలేదు. ఇచ్చటిప్రజాసౌ

59