పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


భీమ:-మంచిపని. నాకు మీరుమంచి సహాయము చేసినట్లాయెను. నేనుతక్షణమే శ్రీధరుని ఇంటికిపోయి నన్ను దూషించినను మెడపట్టినూకినను నేను అతనికి సహాయమొనర్తును.

మధుర; - సార్, నేనెంతమంది వకీళ్ళనో సూపించాను. నిన్నుపోలె నెల్లగుణం యారికిలేదు. నేపోయిదుస్తునా?

విద్యా:-పెళ్ళెగారూ! వారేమో నెల్లగుణం,నేనుకొంచెము దుర్మార్గుడను శవము సాగని, నాకించుక అనుమానం కలిగినా నేను తక్షణమే మీకుచెప్పిపంపిస్తాను.మీరు ఝుడ్తీ చేయండి.

మధుర:- ఆడే అబ్బా? నీవుదా యముడుండావయ్యా, దాసన్ అండి. (అనివెడలిపోవును.)

(వాడు పోయిన తరువాత విద్యాలంకాచార్యులు ఒక్కచిటుకు పొడుముపీల్చి భీమసేనరావుని చూచి)

"ఎట్లు"? జ్ఞానముండవలెనండీ జ్ఞానమూ!

(యవనికపడును).

                 ------

సరిపడని సంగతులు

రెండవయంకము - ఐదవ రంగము.

సరిపడని సంగతులు

రెండవయంకము - ఐదవ రంగము.

కాలము-ఉదయము తొమ్మిది ఘంటలు

శ్రీధరుని యిల్లు

(తార, మద్యరగమున శవమును, ప్రక్కన గాంధీ మహాత్ముని పటముపెట్టి పూజచేయుచు పాడుచుండును శ్రీధరుడుకూర్చొని చింతించుచుండును., పాట ముగిసిన పిదప శీధరుని సమీపించి)

తార:- అయ్యా! మీరిట్లు చింతించుచుండిన ప్రయోజన మేమి? మీకు నేను చెప్పవలయునా? ప్రతిదినమును మృత్యుంజయుని ఆరాధించు మీకు నేను ధైర్యము నుపదేశించుటకు శక్తురాలనా? వేడుక రాట్నము వలె ఎడతెగక తిరుగుచుండు చావుపుట్టు