పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము

సంసారా భ్యేమహతి జలధౌ "మజ్జతాంనస్త్రి దామక్
పాదాంభో జీవగడ భవతో భక్తి నావంప్ర కుచ్ఛ. "

(మరల ఏక తారను ఆవలనుంచి) తెలియ జేయుదునా? తాళ లేను. ఈ తాపమును తా'ళ లేను. తెలి పెదను. ఇం దేమి తప్పున్నది? నా మాటలువిని నన్న పరిహసించును. అప్పటి కైనను నాయాశ నన్ను వీడిపోవును. చెప్పెదనుగాక.

ఆహా! యోచింపకపోయితిని. నన్నే దైవముగా దలచినది. నాకు సౌ ఖ్యోపచారములు చేయుటయే తనవంతముగా భావించినది. నామాట వేద వాక్యముగ భావించినది. అట్టితార నాసౌఖ్యము నుద్దేశించి తనయావనమును, శృంగారమును, మాధుర్యమును కళాసంపదను బలియిచ్చుటకు ఒప్పిన నెట్లు? కూడదు, కూడదు. నా దెంత కూర హృదయము! ఆ మోహనమూర్తి ని నాయీదరి ద్రవిగ్రహమునకు బలియిచ్చుటకు సిద్ధమగునో యేమో! ఛీ! నా కేల ఈచపలత! 'మొదటి నిశ్చయమే యుండనిమ్ము. దారిద్యమునకు, ప్రేమమయనుగు వివాహమునకును మిగుల దూ రము. ప్రపంచమున స్త్రీల విశ్వాసమునకు పాత్రుడు గావలె నన్న భాగ్యవంతుడు అయినను గావలెను. బుద్ధిమంతుడై నను గావలెను. తుదకు తేజోవంతుడై నను గావలెను. తొలుత నే దరిద్రుడను, అనగా లక్ష్మీ దేవియు నేనున్ను దాయాదులము. కనుకనే నాకును ఆమెకును చూపులుగూడ లేదు. బుద్ధియా! మొదటికే లేదు. వకీలు గుమాస్తా పనికికూడ బాగా అర్హుడు గాని నేను మరి యేపనికి అర్హుడను? ఏ పాటి బుద్ధిమంతుడ నగు దును. ఈపాటులన్ని టికన్న సాపాటునందే చాతుర్య మెక్కువ. వర్చస్సంతకును తక్కువ? ఆహా! ఎట్టియుపదవము కలుగ జేయ బూనియుంటిని. ఇది ప్రేమమా? కాదు, కాదు. ఉభయులకు జీవహింస కలుగ జేయునది విష సంకలిత కామముగాని ప్రేమ ముగాదు.

పొరపడుచున్నాను. ఇదే నామనోదైవసాక్షికముగ పలుకుచున్నా డ. తారయందు నాకు స్వచ్ఛమైన నిష్కళంకమైన, నిస్సంకో చమైన పరిపూర్ణమైన పేమముగలదుగాని ఇది తుచ్చకామ