పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి రంగము.


మెన్నటికినిగాదు. అవును. అవును. (రెండు మూడుతూర్లుపచా రుచేయును, తటాలున నిలచి)

నేనంత హేయముగనున్నానా? తారకు నాపై ఏల ప్రేమగలుగ కూడదు అంతటి ముసలి వాడనా? నలుబది యేండ్ల కే వార్ధక్య మా! పాశ్చాత్య దేశమున నలువది యేండ్లేక దా పెండ్లికి తగిన నయస్సు అని భావము! ఇక దారిద్యమా! ఋణమున్నను గుణ ము లేమనాకు, సంపాదింప లేనా? తారను జేపట్టు భాగ్యము నాకు గలిగిన యెడ నేను ఇంతింతై మరి అంతై వ్యాపించి బండ్ల పై బంగారము నార్జింప లేనా? ఇదియునుగాక ఆమెకు భూషణము దుఃఖము; నాకు భూషణము దారిద్యము; మంచి పొందిక ! మంచిపొంద్దిక! ఆమె ననుజూచి సంతసమొందును. నేను ఆమెను జూచి సంతస మొందుదును. దుఃఖము, దారిద్ర్యమును చూచి సంతోషించును. దారిద్ర్యము దుఃఖమునుజూచి సంతోషించును. ఇందు సందేహము లేదు. ఖండితముగ తార సమ్మతించును.


అయ్యో! యౌవన మే! ప్రతిక్షణమును ప్రపంచమును పలు తెరంగు లగు రంగులచే ప్రకాశింప చేసి హృదయమున ఆనందతరంగము లను అల్లకల్లోలముగ పుట్టించుచు స్వర్గ సామ్రాజ్యమునే స్ఫురిం పజేయజాలు యౌవనమే! యౌవనమే! మనోవ్యాకులతను చీకాకు పరచుచు, దుఃఖమును ధ్వంసము చేయుచు, అసాధ్యమును సాధ్యము చేయుచు, నిరర్థకమును సార్థకము చేయుచు, దుర్లభ మును సులభము చేయుచు, ఎగురుచు, అరచుచు, నగుచు, నా ట్యము చేయుచు, ప్రకృతినే తన దాసిగ చేయచూచు యౌవనమే! సహజమగు యౌవనమే! అట్టియౌవనపు సంపూర్ణ సామాజ్య ము కళలుజూపినపిదప, దైవమా! నేనేమి యపరాధ మొనర్చితి నని నన్నిట్లు బాధించుచున్నావు? నామనస్సునీ స్వత్వమని జూ పుటకా నన్నిట్లు పీడించు చున్నావు? 'ప్రేమయను శబ్దమునకు హృద యాగ్నె , అంత ర్వేదనము అనియర్ధము. ప్రేమమా! తొల గిపొమ్ము నానుండి. నామనసును రాయి చేసి, నా స్వాధీనము చేసి కొనియెదను. చేతన ధర్మముగదా వేదన! అచేతన పదార్థమునకి దుఃఖ మెక్కడిది?