పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరిపడని సంగతులు


రెండవ అంకము-మొదటిరంగము

(శ్రీధరునియిల్లు)

(గోడకు ఇనుప మేకులు కొట్టబడియుండి, ఆదుకు కోటు, పంచతగిలించియుం డును. రెండుకట్టె పెట్టెలు మూలకు చేడ్చబడి యుండును. స్టేజుముందటి భాగము న ఒక చిన్ని బల్ల పైన శ్రీధరుడు కూర్చొని ఏక తారా వాయించుచు స్వగతము గా) శ్రీధరు: -

గణనీయంబగు నెంతకష్టమయినన్ క్ష్మాభారము భూరి ధా-
రుణి భృద్భాగముదోగ్బ లంబుననో, ఘోరంభౌతపశ్శక్తి నో,
ఫణివంశాగ్రణిహాగ దివ్య పరసంపల్లభ్యమౌబల్మినో,
ఋణ భారంబమితంబగణ్య మసహం బెవ్వానికి ధాత్రిలో.”

దరిద్ర దేవతకు సాటియే లేదు. ఋణ బాధకు మేటియే లేదు. దారి ద్ర్యము, ఋణము. ఆహా ఎట్టిజత! ఎట్టి దాంపత్యము! పార్వతీ పరమేశ్వరులను మించిన దాంపత్యము. శివునకు పార్వతియర్ధాం గియే. అయిన దారిద్యమునకు ఋణము పూర్ణాంగము. ' ఈ దేవతలు అన్యోన్యాను రాగముతో ఏయింట తాండవమాడు చుందురో ఆయిల్లు శ్మశానమునకుకూడ పుట్టినిల్లనదగు. దారి ద్యముండిన మనసునకు శాంతి యెట్లు? ప్రపంచమున నిపుణ త్వము, కవిత్వము, మేధాశక్తి యోగ సామ్రాజ్యము వీటికి దా రిద్ర్యమే జన్మభూమియందురు. మనో వైభవము దారిద్యము వలన కలుగునా? ఏమో! ఎవ రెరుగుదురు?

ఒక్కటిమాత్రము నాకసుభ వమగుచున్నది. ఎట్టిదరిద్రదశ బాధిం చుచున్నను చిత్త చాంచల్యము మాత్రము నన్ను వదలకున్నది. అయ్యో! నా కేల యిప్పుడిచింత? మనసున ప్రేమ వేదన మొక చోట, దారిద్ర్యరోదన మొక చోట. చిత్తమా! పక్షివలె ఎగిరి పోవుచున్నావు! ఏల నిన్ను నీవే మరచుచున్నావు? చందమామ కై ఆశించుచున్నావు సుమా! మరల ఏక తార తీసికొని)

" తృష్ణాతో యేమ వనపవనోద్ధూత మో హోర్మి జా లే,
దారాపర్తె తనయ సహజ గ్రోహ సంఘాకు లేచ,