పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి యంకము


మగును? అర్చకులకు సద్భావము లేదు. విగ్రహములకు ప్రభా వమే లేదు. ఒకప్పుడు " దేవాలయములయందు దివ్యమగుశక్తి, యుండెను. స్వార్థ త్యాగులై , భూతదయయను నిర్మలనదీ ప్రవాహమున స్నానము చేసి, లోక సేవారంజితమగు వస్త్రము లను ధరించి పరమేశ్వరుని లీలావిభూతిని నొసట నలంకరించి ప్రపంచ క్షేమమే తమ క్షేమముగా భావించి, ధ్యానము చేయు మహనీయులు, ఇందు కలియు చుండిరి. కావున దేవాలయములు దివ్యశక్తి గలిగి ప్రతి ప్రాణులకు పరమానందము నొసగుస్థల ముగ శోభించుచుండెను. ఒకానొకప్పుడు ఈస్థలము యోగ సా ధనమునకు, ఆత్మ పరిశోధనమునకును అనుకూలముగ నుండెను. ముక్తి క మార్గముగనుండెను. ఒకప్పుడీ దేవాలయము ప్రపంచము నకే చిత్రపటమై మానవ కోటికే శరణాలయముగ నుండెను. అర్చకుల స్వార్థతకు ప్రదర్శనాలయము. ముందు వారికి ద్రవ్యముస్పర్శనమిచ్చినగాని, దేవుని దర్శనమబ్బదు. వారుచూ పిన దేవుడే మనకుగతి. దేవుడిప్పుడు దేవుడుగాదు. . మృగా రామము (Zoological Gardens) లలోనుండు విచిత్రమయిన ఒక జంతువు. దుడిచ్చినగాని చూచుటకు సాధ్యము కాదు. తారా! లేడు! లేడు!! రాముడిందు లేడు. ప్రేమ లేనిచోట రాముడుండునా? అయ్యయ్యో! మన దేశీయుల హృదయమున పరిశుభ్రమైన శక్తి ప్రేమలుండెనా, స్వదేశము, స్వరాజ్యము, వేయేల, అప్ప ట్టున మనము స్వర్గమునే యనుభవించుచుంటిమి. రమ్ము పోవుదము.

(నిష్క్రమింతురు)

32