Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

శారదలేఖలు

జనులు గుంపులుగా కూడియుండుట మాకగుపించెను. అది యేదియో యరయ మేమును నటకేగి చూడ నచ్చట మిద్దెకు వెండి పైడి బల్లులు అంటించబడి యుండెను. ఆబల్లుల క్రిందుగా నొక నిచ్చెనపై నెక్కి చేతితో ముట్టిన వారు తలకొక యణాయును, క్రిందనుండియే యర్చకుడా బల్లులపైకి గుడ్డ నెగురవేయ ఆగుడ్డ ముట్టినవారొక యర్ధణాయును నీయవలెనట. ఆ బల్లులను తాకి వచ్చినవారికి బల్లిపాటు దోషముండదట. ఆ వినోదమును రెండు నిమిషముల పాటు నిలువబడి చూచితినేగాని నేను అర్ధణాగాని అణాగాని వ్యయపరచుకొనలేదు. అటనుండి అమ్మవారి ఆలయములోని కేగ ఆమెకును స్నానమే జరుగుచుండెను. అయ్యవారి స్నానము చూడవచ్చునుగాని అమ్మవారి స్నానము చూడరాదట! కాన అమ్మవారి దర్శనము మాకు కాలేదు. ఆనాడు యేకాదశి యగుటవలన నూరేగింపునిమిత్తము మణిమయాభరణములతో నలంకరింపబడిన యుత్సవ విగ్రహములకడనే స్వామిని దేవేరిని గూడ చక్కగా చూచుట కలిగినది.

వరదరాజస్వామివారి యాలయములో దర్శనీయమైన మండప మొకటి యున్నది. ఆ మండపములోని ప్రతి స్తంభముపైనను భారత భాగవత రామాయణాది పౌరాణిక గాధలెల్ల బొమ్మలుగా చెక్కియున్నవి. నల్లరాతితో చెక్కబడిన యాప్రతిమలు సజీవము లట్లెంతయో కౌశలముగ నిర్మింపబడి యున్నవి. పౌరాణిక గాధలేగాక అశ్వారూఢులగు యోధు