శారదలేఖలు
61
లును, శత్రుమర్దనము సేయుచున్న రాజుల ప్రతిమలును అలనాటి యోధులయు, ప్రభులయు నాకృతులను స్పష్టీకరింపుచు నెంతయో నిపుణముగ నిర్మింపఁబడి యున్నవి. ముష్కరులైన తురుష్కులుశిథిలపఱచిన విగ్రహములుగూడ కొన్నియున్నవి. కాని అవి అత్యల్పమని చెప్పవలెను. కాకతీయ ప్రతాపరుద్ర కృష్ణదేవరాయాది ఆంధ్ర రాజన్యులు, యవనసేనా వాహిని దక్షిణ హిందూదేశమును చొరకుండచేసిరి. ఆనాడాంధ్రు లోడ్చిన రక్తమువలననే నేడు దక్షిణ హిందూదేశమందైన పురాతనకట్టడములను జూచు భాగ్యము యావద్భారతీయులకు గల్గినది. దేవాలయములను మసీదులుగను హిందువులను మహమ్మదీయులుగను మార్చి ఉత్తర హిందూదేశ మంతయు భీభత్సముగ జేసిన ముష్కరతురుష్కుల యుద్ధతినణచి దక్షిణ హిందూదేశము యవన హస్తగతము కాకుండ కాపాడిన మన యాంథ్ర వీరుల పరాక్రమాతిశయము సంస్తవనీయమైనది. ఆంధ్రులిందులకు గర్వించవలసినదే. కాంచీపురము చాలకాలము పల్లవరాజధానియై యుండుటచే పల్లవరాజులు కట్టించిన దేవాలయములు పెక్కులున్నవి. పల్లవరాజులు శివ భక్తులు. కాన శివకంచియందలి దేవాలయములన్నియు దాదాపుగా వారు కట్టించినవే. వరదరాజస్వామివారి ఆలయము కృష్ణదేవరాయలు కట్టించెనని యక్కడివారు చెప్పిరి కాని అది యెంతవఱకు నిజమో! మేము తరువాత చూచిన క్షేత్రము చిదంబరము. అచ్చటి స్వామి నటరాజు. ఆయన దేవేరి శివకామసుందరి. నటరాజస్వామికి ఆరుద్రనక్షత్రమునకు