Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

(Sanitary dept)లోఁ జాలాకాలము పనిచేసి యందున్నతపదవుల నొందగలయర్హత సంపాదింపఁగోరి యింగ్లండునకు వెళ్లివచ్చిరి (1929)

బాల్యమం దనఁగాఁ బెండిలిగాకమున్ను ఈమె, బాపట్లలోనున్న మిషన్ బాలికాపాఠశాలయందు నాలవతరగతి వరకును జదివెను. ఆవెనుక సంఘాచారముచొప్పున బడి మానివేసినను, విద్యాసక్తిమాత్రము విడువకుంట, మన యదృష్టమే యనవచ్చును. ఇంటియందే తన రెండవయన్నగారగు శ్రీయుత నరసింహంగారి నిరంతరసహాయ ప్రోత్సాహముల వలన, నర్సాపురం పరీక్షలు, విజ్ఞానచంద్రికాపరిషత్పరీక్షలు, భక్తిప్రచారిణీ పరీక్షలు మున్నగు వాటియం దుత్తీర్ణయై నర్సాపుర స్వర్ణపధకము, కేసరి స్వర్ణపదకము మొదలగు బహుమానములఁ బడసెను. సహజముగా స్త్రీవిద్యాభిమానులగు సహోదరులందరును జేయుచుండిన సహాయముచే నీయమ యొక వేయిపుస్తకములైననుఁ జదివెను. 'వసుమతి' యను నొక సాంఘికనవలను రచించి స్వర్గస్థురాలగు తనయక్క సుబ్బలక్ష్మమ్మగారి కంకితమిడి యంతటి చిన్నవయసుననే పేరువడెను. అప్పడప్పడే వెలువడసాగిన 'అనసూయ' ఈమెవ్రాతలఁ గండ్లనద్దుకొన్నది, అటుతరువాత 'నాంధ్రపత్రిక,' 'భార్రతి', 'ఆంధ్రలక్ష్మీ ', 'గృహలక్ష్మీ' మొదలగునవి యిూమె వ్రాతల కగ్రస్థానముల నీయసాగినవి, "ప్రపే