ఈ పుట అచ్చుదిద్దబడ్డది
5
దిరే ప్రాక్తనజన్మవిద్యా" యనుట సమంజసముకదా యిట్టి యెడల!
"గీ॥ బ్రాహ్మధర్మ ప్రవిష్టుఁడు బ్రహ్మవిదుఁడు
సత్యమార్గానువర్తి సుసౌమ్యమూర్తి
యాంధ్రసాహితి ననుజాతనైన నాకు
సాదరంబున నేర్పిన సజ్జనుండు
పరమపావనమెనట్టి పాలపర్తి
యన్వయసుధాబ్ధి సోముఁడై యవతరించి
ధరను నరసింహమను పేరఁ బరఁగినాఁడు
సోదరుండును గురుఁడునై సొరిదినొప్పు
మాన్యచరితుఁ డాతనికి నమస్క_రింతు
వసుమతీసతి చరితమున్ వ్రాయువేళ ॥"
అని తనకింతయశము గల్గుటకు హేతుభూతుఁడగు నగ్రజన్మునియెడఁ గృతజ్ఞత దెలిపి యామహాశయుం డొసఁగిన శబ్దార్థచంద్రికయను నిఘంటువునే సారెకట్నముగా గ్రహించి యావల గృహిణీపదముఁ జొచ్చినది యీమె.
ఇంక నత్తవారింటఁబడి యీచదువంతయు 'గుంటఁబెట్టి గంటకొట్టక' యుండున ట్లీ యువతీమతల్లికి భర్తగారి దన్నుదొరికినది. ఆవిషయమున మనసార నీమె యనిన మాటలే వ్రాయుటలెస్స.