3
సరములేదు. మొదటివారు, 'దర్బారు' పత్రికాధిపతులు; రెండవవారు, 'ధర్మసాధనీ' నేతలు; మూడవవారొక డి॥ బోర్డు హైస్కూలులో నుపాధ్యాయులు; నాలవవారు ప్రకృతి చికిత్సాయోగ సాధకులు; పూర్వము బందరు జాతీయకళాశాలలో నధ్యాపకులుగా నుండినవారు; ఐదవవారు ప్రస్తుతము బాపట్ల పోస్టుమాస్టరుగా నున్నారు. ఇఁక నీ వరలక్ష్మమ్మగారియక్క, అచ్యుతుని వారికోడలు, స్వర్గస్థురాలైనది. ఆమె కిద్దరాడుపిల్లలు. చెల్లెలు, భీమరాజువారి కోడలు; తెనాలిలో నిపుడు మేజస్ట్రీటుగా నున్న శ్రీయుత శ్రీనివాసరావుగారి ధర్మపత్ని.
ఈ మనసహోదరి శ్రీమతి వరలక్ష్మమ్మ గారు. 6-10-1896 తేదీని జన్మించెను. ఈయమకు సం 1909 రమునఁ బెండిలియైనది. అత్తవారు కనుపర్తివారు, ఆర్వేలవారు, కాశ్యపసగోత్రులు; బాపట్ల తాల్లూకా పందిళ్లపల్లి గ్రామస్థులును కరణీకోద్యోగులు. ఈమె యత్తగారిపేరు ఆదెమ్మగారు; మామగారిపేరు, రఘుపతిరావుగారు. ఈ రఘుపతిరాయదంపతులు, తమ బిడ్డల విద్యాభివృద్దికొరకుఁ బూర్వాగతమైన యాగ్రామకరణీకమును మానుకొని బాపట్లకు వచ్చిరి. వీరికి నలుగురు పుత్రులును, నొకకొమార్తెయు గలిగిరి. వీరిలో హనుమంతరావుగారు మూడవ కొమారులు. ఈయనయే మన వరలక్మమ్మగారి భర్త. వీ రారోగ్యశాఖ