Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

35

భరితములగును. నా యేడుపు నాకు సర్వదానున్నదే. మిమ్ముగూఢ నేల చింతింపఁజేయవలయును? కాని యీ వివాహ శాసనవృత్తాంతము కొంచెముగా వినియుండుటచే ప్రతికూలుర వాదనను ఖండించుటకే నా చరిత్రను జెప్పితిని. పిల్లకు యుక్తవయస్సు వచ్చువరకు పెండ్లిచేయకున్నచో పిల్లయనుమతిని పెండ్లిచేయవలసి వచ్చుననియు, అవ్యక్తురాలగుబాలిక చక్కనివాఁడు కావలెననియు చదువుకొనినవాడు కావలెననియు, తంటాలుపెట్టుననియు, పిల్లకు తెలిసియు దెలియని ప్రాయమగుటచే బాధ్యత నెఱుగక, స్థితినెఱుగక, కోరరాని కోరికల గోరుననియు, ఆవిధముగా కన్యను మెప్పింపగల వరుని దెచ్చు టసాధ్యమనియు, కాబట్టి ఆడుపిల్లల వివాహ బాధ్యత తలిదండ్రుల చేతిలోనే యుండుట యుక్తముకాని పిల్లల కొప్పగించుట ప్రమాదకరమనియు, పెక్కురు వాదించుచున్నారు. నా తండ్రికాని నా పెనిమిటి తలిదండ్రులుగాని తా మేమాత్రము బాధ్యత నెఱిగి మా వివాహములు చేసిరో యోచింపుడు? నా యత్త మామలు అప్రయోజకుఁడగు కొమారునకు పెండ్లిసేయుటకు కడుపారగన్న కొమార్తెను ముసలివానికిచ్చిరి. కూతురుకాపురమటులయ్యె, కొమరుని కాపురమిటులయ్యె. ఇక మాతండ్రియో వార్థక్యమున పెండ్లి కాసపడి తనకాఁపురమును పాడుజేసికొనుటయేకాక నన్నుగూడ బలిబెట్టెను. మాకే యధికారమున్నచో నట్టి ముసలివానిని యామెగాని యిట్టియయోగ్యుని నేనుగాని వరించి యుందుమా? ఇది తలిదండ్రులు బాధ్యత నెఱుగకుండఁ జేసిన యక్రమకృత్యముగాదా? తల్లులారా! ఈదేశమున యిది