Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

శారదలేఖలు

నాయొక్కరిత చరిత్రమేగాదు. ఇట్టి వివాహము లసంఖ్యాకములుగా మనదేశమున నిత్యమును జరుగుచున్నవి. ఇట్టి యక్రమ వివాహ ప్రవాహమును నాపుటకే నేను హరవిలాసశారదాగారి బాల్యవివాహ నిషేధచట్టము నాహ్వానించుచున్నాను. నేనేగాదు. దయార్ద్రహృదయులగు స్త్రీ పురుషులెల్ల రీబిల్లు నాహ్వానించెదరుగాక యని కోరుచున్నాను. అంతియే గాక నలుబదేండ్లు మించిన పురుషుడు వివాహమాడ రాదనియు, అధవా చేసికొనినచో బాలికల జేసికొనరాదనియు గూడ నేమహనీయుఁడైన శాసనము దీసికొనివచ్చినచో స్త్రీలోక మామహనీయుని కలకాలము కృతజ్ఞయై స్మరింపగలదు. దీనిసంగతి యిట్లుండనిండు. ఇది భవిష్యద్విషయము. ఇప్పుడీ బాల్యవివాహ శాసనము విషయమై మనస్త్రీ లుపేక్షా భావముతోఁ జూడరాదు. స్వార్థచింతచే పురుషులు దీనికి ప్రతికూలురుగానుండ రజస్వలాభయముచే స్త్రీలు దీనికి వ్యతిరేకలగుట మనగోతిని మనము త్రవ్వుకొనుట సుమా. పిల్లలు పద్నాలుగేండ్ల వఱకుంచినచో ఈడేరరా? అని అవ్వగారు భయముతో అడిగినారు. తగిన వరులు లభింపక కన్నెలను పదునాలుగేండ్లవఱకుంచినచో నాపిల్ల లీడేరకుండిరా? చాటునకు సంఘపు తోడ్పాటును, బహిరంగమునకు బహిష్కారమునా? ఇంతకు మనకు మన శాస్త్రములు ప్రతికూలముగాలేవు. ప్రతికూలముగా నున్నది యాచార ఛాందస శ్రోత్రియ సం.....