ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18
శారదలేఖలు
సామర్థ్యముగల పనివారుండియు నేటేట కోటిరూపాయలు విదేశములకు ధారపోయు చుంటిమిగదా యని. - కాని మనస్త్రీలకు వన్నెచిన్నెలపై వ్యామోహము నశింపనివఱకు మనదేశపు పరిశ్రమ లభివృద్ధిజెందవు. దేశీయపరిశ్రమ లభివృద్ధిజెందినగాని మనదేశ మభివృద్ధిజెందదు. ప్రియమిత్రమా! అట్టి కళ్యాణదినములు మన భారతభూమి కెప్పుడు వచ్చునోగదా!
భావపురి
ప్రేమంపుచెలి,
1928 మే
శారద