శారదలేఖలు
19
సౌభాగ్యవతియగు కల్పలతకు :—
నెచ్చెలీ, ఒక శుభసమాచారము. ఏ కవయిత్రీమణి వాగమృతముల సెవులార గ్రోల ఖండ ఖండాంతర వాసులెల్ల రభిలాషతో నెదురుజూచుచుందురో, ఏవిదుషీమణి విమల వాగ్ఝరి ప్రవహించిన తమకష్టములెల్ల గొట్టుకొనిపోవునని వలస రాష్ట్ర భారతీయు లాసతో నాహ్వానింపుచుందురో ఏసాధ్వీమణి గంభీరోపన్యాస మాలింపవలెనని భారతీయులెల్ల రనిశ ముత్కంఠపడుచుందురో అట్టి సుప్రసిద్ధకవయిత్రియు, విదుష మణియు నారీరత్నమునునగు శ్రీమతి సరోజినీదేవిగారి మహత్తరోపన్యాసమును ఈనెల 28 - 4 - 28 తేదీని మదనపల్లియందు వింటిని. నీవు వినలేదని యనుకొంటిని. లేఖామూలముగా దెలుపవచ్చును గదా యని మరల తృప్తిగంటిని.
ఈ పురము నందలి హిందూ స్త్రీసమాజమువారి యాజమాన్యమున పైసభ జరుపఁబడినది. నెమలి పట్టాభిరామరావు పంతులుగారి కొమార్తెయగు శ్రీమతి పద్మాసనీదేవి (బి.ఏ.,) గారు నాటిసభ కగ్రాసనాధిపురాలు. సమావేశమైన స్త్రీలు కొద్దిమందియైనను, వచ్చిన స్త్రీ లెల్లరు దాదాపుగా నాంగ్లభాషా పరిచయము లేని తెలుగు స్త్రీలేయైనను, శ్రీమతి సరోజినీ దేవిగారు మిక్కిలి శాంతముతో స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గుఱించి యుపన్యసించిరి. దేవి చెప్పిన