శారదలేఖలు
17
బూనితినిగదా యని భావించితిని. కాని విదేశపు గాజులుతొడిగి కొనుటకు మాత్రము పాల్పడలేదు. ఒకానొక మహానీయు డొకానొక స్త్రీలసభలో "తల్లులారా, మీరు విదేశపు గాజులు ధరించుట వలన సంవత్సరమునకు కోటి రూప్యములు విదేశముల పాలై పోవుచున్నవి. కోటి రూప్యములన నెన్నియనుకొంటిరి? ఆ రూప్యములన్నియు సంచులు కట్టివేసిన ఈహాలంతయు నిండి పోవును. అన్ని రూపాయలు విదేశపు వన్నెగాజులకు ధారపోయుచున్నారు.” అనిచెప్పిన వాక్యము లహర్నిశలు నాహృదయమున ప్రతిధ్వనించుచుండును. అందువలననే నేను విదేశపు గాజులనుండి రక్షింపఁబడితిని. ఇప్పుడు శ్రీజ్ఞానప్రసూనాంబిక కృపవలన రెండువందల యేబదిగాజులు కాళ్ళహస్తిలో చేయించి తెచ్చుకొంటిని. నాకఱవు తీరినది. గొల్ల పేరమ్మలాగున్నావని నీవు నవ్విన నవ్వుదువు గాక. చేతినిండ తొడిగికొనిన నల్లగాజులనుచూచుకొని నేను మహానందమున నుప్పొంగిపోవుచున్నాను. నా నల్లగాజులెంత చక్కగ నున్నవనుకొంటివి? బహు చక్కగ నున్నవి. సన్నమునకు నాబంగారుగాజులతో గలసిపోయినవి. మెఱుఁగునకు విదేశపుగాజులకు మించిపోయినవి. ఆ గాజులు వేసికొనగనే యానందముతో నా హృదయము నిండిపోయినది. కాని యా గాజులను చూడగనే నాకొక విధమైన విచారము గూడ గల్గినది. ఏలనందువా? ఇట్టి చక్కని గాజులు చేయగల