14
శారదలేఖలు
దుష్టులెవ్వరో కనుపించిన కత్తికి రెండు తుండ్లుగా నఱికి వేయనా? అయ్యో! ఏమిదారి! ఎట్లీరక్తస్రావము కట్టును? ఏదియైన మందాకుల రసము పిండిచూతునా యని చెంతనున్న యడవి కేగి రకరకముల మందాకులు తెచ్చి రసము పిండిచూచెను. కాని లాభములేదు. రక్తము కారుచునేయున్నది. కన్నప్ప చేయునదిలేక దిగులొంది కన్నీరు కాల్వలై పాఱుచుండ మ్రాన్పడినట్లు నిలిచెను. కొంతతడ విట్లునిలువ కండకు కండయను సామ్యము తోఁచెను. ఆహా! మంచిమందు తోఁచెను. స్వామి కంటికి నాకంటి నంటింతు ననుకొనెను. తోడనే కత్తితో తాటికాయనుండి ముంజె నెత్తినట్లు తనకన్ను నూడదీసి స్వామికంటి కంటించినాడు. అద్భుతముగాస్వామికన్ను చక్కఁబడిపోయినది. కన్నప్పకు పరమానంద మైనది. స్వామిని కౌఁగలించు కొనినాడు. ముద్దు పెట్టుకొనినాఁడు. సాష్టాంగ పడినాఁడు. ఆడినాడు. పాడినాడు. భగవంతుడు భక్తునిచేతి ముద్దుబిడ్డ. భక్తు డెన్నెన్ని విధముల నుపలాలించిన యన్నన్ని విధముల ప్రియము గూర్చుట యా మహామహునకు సంతోష ప్రదము. ఈ విధముగా గొంతసే పానందనమగ్నుడై కన్నప్ప నృత్యముచేసి స్వామివంక చూచినాడు. ఆహా! ఏమి చెప్పుదు నాభీభత్సము! స్వామి రెండవకంటినుండి నెత్తురు కారుచున్నది. స్వామి నేత్రము చక్కఁబడుటకు దగిన యౌషధము తనవద్దనే యుండ కన్నప్ప కిక దిగులేమి ? కాని తన రెండవకన్ను గూడ నూడబెఱికినచో దాని నంటించుటకు స్వామి కన్నెక్కడగలదో