శారదలేఖలు
13
యామిష ఖండములుగావు, యమృతపు ముక్కలు సుమా! నాయందు భక్తిభరితుఁడగువాడు నాకెట్టి హేయపదార్థ మిడినను నాకది రుచిరాన్నమే సుమా! కావుననే యాతని నంజుడులు నేనంత ప్రీతికరముగ స్వీకరింపుచున్నాను. అతఁడు మహాభక్తుడు కాన యతని హృదయమే నాకాలయము. వాని పలుకులే నాకు స్తుతివాక్యములు. అతని భక్తితత్పరత నెఱుంగ గోరుదువేని రేపుదయమునవచ్చి మఱువుననుండి పరీక్షింపుమని చెప్పి యంతర్హితుడయ్యెను. వెంటనే శివగోచరి అదరిపడి లేచి యప్పటికి తెలతెల వాఱుచుండుటం దెలిసి కాలకృత్యంబుల దీర్చికొని సువర్ణముఖిలో మజ్జన మాడివచ్చి దేవాలయమునకేగి స్వామి చెప్పిన తెఱుఁగున నొకమఱుఁగున నక్కియుండి కన్నప్పరాక ప్రతీక్షించు చుండెను. వాడుకమేరకు కన్నప్ప పూజాద్రవ్యాదులను నభిషేకజలమును నైవేద్యపు నంజుడులను గైకొని స్వామి సన్నిధి కేతెంచెను. కాని యేమి చిత్రము! నాడు స్వామి నిత్యమువలె సుఖముగలేఁడు. అతని కొక కంటినుండి ఘోరముగ రక్తము ప్రవహించుచున్నది. అది చూడగనే కన్నప్ప దుఃఖముజెంది హోరుహోరుననేడ్చుచు తెచ్చిన పదార్థము లక్కడనే పాఱవైచి "స్వామీ! నీ కిట్టియాపద యెట్లుతటస్థించె? నా పగవారగు వేఁటకాండ్రు చేసిరా? లేక మృగములు చేసెనా? విశాల విశ్వమునంతను పరికించెడు నీ నేత్రమున రక్తము స్రవించిన నే ది మందు? అయ్యో! యేమిచేయుదు. నీకపకారము గావించిన యా