Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

169

ధన్యులు. వానరయూధములు రామకార్యమున పాల్గొని పావనమైనట్లు నేడు మహాత్ముని యుద్యమమున పాల్గొనినవారెల్లరు పునీతులగుదురు. నేటి యీ ధార్మికయుద్ధము బాహుబలమునకు సంబంధించినదిగాదు. శస్త్రాస్త్రములతో గూడినదికాదు. కేవలము ప్రభుత్వముతో పోరాడుటే దీని లక్ష్యముకాదు. దయాసత్యశౌచవిహీనమై విదేశవ్యామోహవల్లరులం దగిలి ఆత్మగౌరవమును గోల్పోయి కర్తవ్యములు మఱచి యున్న భారతజాతికి చిత్తసంస్కారముగావించి కర్తవ్యపరాయణులఁజేయుటయే నేటి మహాత్ముని శాంతిసమరముయొక్క పరమార్థము. ఈ ధార్మికసమరములో భారతదేశమునం దుదయించిన యేవ్యక్తియు చేరకయుండుటకు వీలులేదు. ఎవరు దీనికి దూరులగుదురో వారు ధర్మమునకు దూరులు; సత్యమునకు దూరులు; పరమాత్మునకే దూరులు!! కల్పలతా! ఇట్టి సత్సమయముసగూడ ఆత్మోపలబ్ధిని బడయజాలనివారు, నిజముగా సర్వదూరులగుట నిక్కముగదా! అయితే ఇందు మన స్త్రీల కర్తవ్యమేమి? అది యిపుడు మనము యోచింపవలసిన మాట. కాని దీని కింతగా యోచించవలసిన పని ఏమి? రాముని వెనువెంట తరలిన సీతాసాధ్వీమణి చందమున ననవరతము మహాత్ముని యడుగుజాడల నడచుచు పుత్రులును, భర్తయుగూడ బందీకృతులైనను నిరుత్సాహమనునది లేక చింతయనునది యెఱుగక దాదాపు అరువదేండ్లు సమీపించినను వ్యగ్రోత్సాహముతో కార్యరంగమున నిలిచి పని చేయుచున్న బాబుజీప్రియపత్ని కస్తూరిబాయియే, మన స్త్రీల