Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

శారదలేఖలు

యం దీసుగుణములెల్ల విరాజిల్లుచుండుటచేతనే అఖిలప్రపంచ మాతని పూజించుచున్నది. ప్రేమించుచున్నది. ఆహా ! ఇట్టి మహనీయవ్యక్తి పరమపావనమైన మన భారతదేశమున నుదయించుటయు, ఈ పూజ్యచరితునకు మనము సమకాలికుల మగుటయు నాతని సత్యాగ్రహ అహింసాత్మికమగు ధార్మికోద్యమమును కన్నులార గాంచగల్గుటయు నిజముగా మన భాగ్యమే.


శ్లో॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ ధుష్కృతాం
           ధర్మసంస్థాపనార్థాయ సంభవామియుగేయుగే
   యదాయదాహి ధర్మస్యగ్లానిర్భవతి భారత
           అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం నృజామ్యహం.


'ఏకాలమున ధర్మమునకు హానికలుగునో, అధర్మమునకు వృద్ధికలుగునో యప్పుడెల్ల నేను వచ్చుచున్నాను' అను శ్రీ గీతావచనప్రకారము శ్రీ మహాత్ముడు ఉదయించియున్నాడు. తల్లి, దుర్భరమగు గర్భక్లేశము ననుభవించుట వలననే పున్నమచంద్రునివంటి కుమారుని బడయగలిగినట్లు మన దేశము పరాధీనతాదిక్లేశము లనుభవించుటవలననే యిట్టి మహాపురుషుని గాంచగల్గెను. పేదల బ్రోచుట, దీనుల రక్షించుట, పరాధీనుల బంధవిముక్తులను గావించుట ఎప్పుడును సజ్జనుల కర్తవ్యము. నేడు లోకైకపూజ్యుడగు మహాత్ముఁడు గూడ నిజదేశపు దుస్థితిగని దుఃఖార్తుడై ఇట్టి మహత్కార్యమును పూనుకొనినాడు. ఈ మహాపర్వసమయమున నా మహాత్ముని యుద్యమములో జేరి కార్యపరతంత్రులైనవారు