158
శారదలేఖలు
ఏమన తిథిదోషములు, వారపు పట్టింపులు, శూన్యము, మౌఢ్యమాదిగాగల నిషేధములు ఈయేటి పెండ్లిండ్లలో కానరావు. ఆపద్ధర్మముగా ఈసంస్కారమునకు శాస్త్ర మొప్పినదట. పాపము మన శాస్త్రములు చాలమంచివి. ఎవరికేవీలుగావలెననినను దాని కనుగుణ్యమగు నుదాహరణశ్లోకమును జూపి పూర్వాచారపరాయణుల రక్షించును. ఆ కల్పవృక్షము ప్రాపున వారుచేయని సాహసములేదు. పసిబాలలకు పరిణయములు చేసిరి. కసుగందులను గూర్చుండబెట్టి గర్భాధానమంత్రములను వల్లెవేయించిరి. పానుపు వేయించిరి. మిథున విడియము లిప్పించిరి. బొమ్మ నప్పగింపజేసిరి. ఇట్టివివాహము లొకటియా? రెండా ? మాసములలో నుత్తమమైన యీ శుక్లసంవత్సర మార్గశిరమాస మంతయు నిట్టి శిశువివాహములతో కళంకితమై పోయినది. మన మంగళాద్రి నృసింహుడేమి, తిరుపతి వేంకటేశ్వరుడేమి, సింహాద్రియప్పన్న యేమి యీ మాసములో తమ సన్నిధానమున నెన్ని శిశుకల్యాణములు జరిపించిరో లెక్కలేదు. రాళ్లుదేవుళ్లయిన రాసులు మ్రింగవాయని వేమనయోగీంద్రుడు సందేహించినట్టుగనే యీ శిశువివాహములలో దేవుళ్లు రాళ్లయినారు. లేకున్న ఆయాస్వాములవారల సన్నిధానమున తల్లిదండ్రు లిట్టి యక్రమ వివాహ జరుప గలిగియుందురా?
కల్పలతా ! నాకీపెండ్లిండ్ల గడబిడచూచిన మనవారి మౌఢ్యమునకు మహాశ్చర్యమగుచున్నది. చేజిక్కిన పసిబిడ్డలకు