శారదలేఖలు
155
సౌభాగ్యవతియగు కల్పలతకు:-
నెచ్చెలీ !
ఏమిపెండ్లిండ్లు ! ఏమి ఊరేగింపులు ! ఏమి కోలాహలము ! అన్నివస్తువులకు ధరలు లేచిపోయినవి. గుడ్డల దుకాణములలో సరకు ఝాడాఅయినది. మార్కెటులో కూరలు శూన్యము. మాసినగుడ్డలతో మాగిపోతూన్నామని మొత్తుకొనుచున్నా చాకలివాండ్రు లగ్గసరి అని గుడ్డలుతుకుట మానుకొని పల్లకీమోతలతో పరువులెత్తుచున్నారు. ఇక భజంత్రీల గడబిడ సరేసరి. చంకనుండెడి పొదులు వంకెనువేసి తాళములతో మునిగితేలుచున్నారు. వంటలవారి, పురోహితబ్రాహ్మణులవారి ఆర్జన, అడావిడి చెప్పనక్కరలేదు. కానిమ్ము ఎన్నాళ్లీరొద. దీనితర్వాత వీరందఱికి సుఖసుప్తియే గదా! మేళతాళము లింకా కొంతకాలము జీవించియున్నను పల్లకీలకు మాత్రము పూర్తిగా సెలవే. ఇఁక పెండ్లిండ్లకు వెళ్లివచ్చెడి పేరంటాండ్రకు బొత్తిగా తీరుబడిలేదు. ఇల్లుమఱచిపోయినారంటే సందేహములేదు. పెండ్లి, జోడుపెండ్లిండ్లు, పెండ్లిపైపెండ్లి, పెండ్లిలోపెండ్లి, కార్తిక మార్గశిర మాసములలో రైలువారికి రాబడి ముక్కాలు మువ్వీసము ఈ పెండ్లివారి నుండియే! మదరాసు దక్షిణ మహరటారైల్వే కంపెనీవారు క్రిష్టమసుదినములలో కన్న యీ లగ్గసరిలో ఈపెండ్లి ప్రయాణికులకు తక్కువచార్జీలు యేర్పాటుచేసిన ప్రజలకు చాల ఉప