Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

శారదలేఖలు

వేస్తేబాగుంటుంది. వారివేషధారణమనిన జనులు అధికసంఖ్యాకులు వస్తురు. డబ్బుబాగావచ్చును. కానవారిని మావిద్యాసంస్థసహాయార్థం మొక్కప్రదర్శనమును కోరితె బాగుండు ననుకొంటిని. కాని వారి యిప్పటి స్త్రీల నాటకరంగప్రవేశయత్నమును జూచి సాయము చేయమంటే ఏఆడదాన్నైనా తనతో ఆడజాతికి పట్టుకరమ్మంటారేమో! అట్లా తీసుకురమ్మంటే ఎవతెను తీసుకవచ్చేది? ఏఅమ్మనైనా నీవు వస్తావా? అని అడిగితే నీవే ఆడరాదా? అంటుందేమోనని భయం. మఱిన్నీ రాఘవాచార్యులుగారు రామదాసుపాత్రను ధరించినచో రామచంద్రారెడ్డిగారు కబీరు పాత్రమును ధరించినగాని బాగుండదు. స్త్రీ లెక్కిన రంగభూమి నెక్కనని యీయన వ్రతము. స్త్రీలు స్త్రీపాత్రము ధరించినగాని నాటకమాడనని ఆయనపట్టు. ఈ సంగతి సందర్భములు చూచి వారిసహాయమును కోరుట మానుకున్నాను.”

సోదరీ! స్త్రీల భీతి యిట్టులున్నది. మఱియు నొక మనవి. నీప్రత్యుత్తరము దెల్లెడలను నేను జ్ఞానిని, తత్వజ్ఞురాలను, నాబుద్ధి యసాధారణమైనది యను నాత్మస్తుతియు విూరు వివేకరహితులు, అజ్ఞానులు, దురభిమానులు, అల్పబుద్ధు లనుపరనిందయు గోచరించుచున్నది. జ్ఞానులును విశేషించి తత్వజ్ఞులునునైన వారిట్టివిముందుగా త్రుంచివేసికొనదగినది యని తెలిసికొనగోరెదను.


భావపురి

మిత్రురాలు

జనవరి 1930

శారద.