156
శారదలేఖలు
కారముచేసిరని కీర్తింపబడెడి వారే; కాని వారాపుణ్యమునకు పాలుపడలేదు.
అయితే యీ పెండ్లిండ్లప్రళయములో నాకు తగిలిన పేరంట మొకపెండ్లిదేకాని యీ పెండ్లిండ్లసందడివలన నేను పొందినంత శ్రమ, నిద్రనష్టము మఱియొకరు పొందియుండరు. ఏమందురా? గొప్పరాజవీధిలో మాయిల్లు; మఱియు రాజుబాటనానుకొనియే మాయింటి గోడ. చలికి వెఱచి, చూచుటకు విసిగి ఇంటిలో దట్టమైన దుప్పటి ముసుగుపెట్టుకొని పడుకొనినను ఆ యెడతెగని యూరేగింపుల మంగళతూర్యరవములు చెవులలో దూరకుండ నేమి చేయగలను? కాన పెండ్లిండ్లు విరివిగా జరిగిన మార్గశీర్ష మాసమంతయు సుఖదమైన సుప్తి నెఱుగను. క్రిందటి వారములో ఒకనాటిరాత్రి ఓపిక పట్టుకొని వచ్చిన యూరేగింపు నెల్ల చూడవలెనని సంకల్పించుకొంటిని. నా పంతము చెల్లలేదు. అఱగంటలో అయిదూరేగింపులు వచ్చెను. ఒక ఊరేగింపుచూచి లోనికివచ్చి మంచముపై మేనువాల్చితినో లేదో మరల నింకొక పెండ్లివారి యూరేగింపులోని పెద్దబూరగల బూరటింపు చెవులు చిల్లులు పడజేసెడిది. మరల దానిని చూచివచ్చునప్పటికి కింకొకదాని బం, భం, బూ, బూ, అను ధ్వనులు వినవచ్చెడివి. ఎంతచూడగల వేడుకలైనను ఒకటి రెండయిన ముచ్చటగాని రే యెల్ల నదియే రొదయైద విసుగే కాకుండ అసహ్యముగూడ గలుగుట ఆశ్చర్యమా! ఇఁక చూడజాలనని పంతము నిడిచి పడుకొం