132
శారదలేఖలు
మధ్యాహ్న కార్యక్రమము ఒంటిగంటకని ప్రకటనలో నుండుటచే నించుమించుగా మరల ఆవేళకు దుర్గావిలాసమున కరిగితిమి. కాని అప్పుడును సభలసందడి కాన్పింపలేదు. కొద్దిగా పురస్త్రీలు మాత్రము వచ్చుచుండిరి. ఈపూటగూడ సభ యెప్పుడు జరుగునో యనుకొంటిమి. దాదాపు రెండుగంటల వేళ సన్మానసంఘాధ్యక్షురాలును, సభాధ్యక్షురాలును సభకరుదెంచిరి. అంత స్త్రీల సభకై ప్రత్యేకముగా నిర్మింపబడిన విశాలమగు పందిరిలో చేరితిమి. ఇతర పురములనుండి యరుదెంచిన స్త్రీల సందడియేగాని పుర స్త్రీలరాక కొలదిగా నుండెను.
విజయవాడ నాకు చిరపరిచితమైన పురము. ఆ పురస్త్రీలు సిగనిండ పువ్వులు దుఱుముకొని యొడలినిండ నగలుపెట్టుకొని వన్నెవన్నెల విలువచీరలను ధరించి ప్రతి చిన్న హరికథకును, ప్రతి భజనసమాజమునకును తండోపతండములుగ వచ్చుట నే నెఱుంగుదును. ముఖ్యముగా ప్రసిద్ధ నాటకఖేలన మనినచో పురుషులుకూర్చుండు ప్రదేశముకంటె స్త్రీలుకూర్చుండెడితావు క్రిక్కిరిసిపోవుట బెజవాడ నెఱిగిన వారికి క్రొత్తగాదు. కాని మహిళాసభపై వారేలనో శీతకన్ను వేసిరి. వివిధప్రదేశములనుండి పెక్కుమంది విదుషీమణు లరుదెంచి తమయూర గుమికూడి స్త్రీలకు సంబంధించిన పెక్కువిషయములను గూర్చి చర్చించుచుండగా వానిని చూచుట