Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

133

కైనరాని పురస్త్రీల యుదాసీనత యనుచితమును, నక్కజమును అనిపించెను.

అధ్యక్షురాండ్రు సభ కరుదెంచిన తరువాత సభా ప్రారంభమున కాలస్యము జరుగలేదు. శారదానికేతనపు బాలికల సుమధురమైన దైవప్రార్థనతోడను, భరతమాతృస్తవముతోడను, రాట్నగానముతోడను, సభ ప్రారంభమయ్యెను. తదుపరి అధ్యక్షురాలి యెన్నికతంతునడపి శ్రీమతి ముత్తులక్ష్మిరెడ్డిగారిని యగ్రాసన మెక్కించిరి. తరువాత నొక విదుషీమణి అచ్చొత్తిన స్వాగతపద్యములను మనోహరముగ జదివెను. అప్పుడే కళావంతులు, శ్రీ॥ ముత్తులక్ష్మమ్మగారు తమ సంఘమునకు గావించిన యమూల్యోపకారమునకు కృతజ్ఞతా సూచకముగా స్వాగతపత్రమును సమర్పించిరి. అనంతరము ఆహ్వానసంఘాధ్యక్షురాలగు తుర్లపాటి రాజేశ్వరమ్మగారు విషయగర్భితమైన తమ మహోపన్యాసమును జదివిరి. తరువాత అధ్యక్షురాలగు డాక్టరు ముత్తులక్ష్మిరెడ్డిగారి యాంగ్లోపన్యాసమున కాంధ్రానువాదము వేఱొక నారీమణిచే చదువబడెను. మఱియు వారిరువురి యుపన్యాసములును పుస్తకరూపమున ప్రచురితములై సభలో పంచిపెట్టబడెను. మొత్తము మీద రెండుపన్యాసములు స్త్రీలకు సంబంధించిన పెక్కువిషయములతోగూడి భావగర్భితములుగా నుండెను.

తదుపరి తీర్మానము లారంభమయ్యెను. మొట్టమొదటిదే శారదాబిల్లు శాసనమైనందులకు మహిళాసభవారు తమ