130
శారదలేఖలు
సౌభాగ్యవతికల్పలతకు: —
నెచ్చెలీ!
బహుకాలమునకు నీకు మన ఆంధ్రమహిళాసభను కన్నారజూచి తెలుపగలుగు భాగ్యమబ్బినందులకు సంతసమగుచున్నది.
నిజముగా ఈ నవంబరునెల మొదటివారము మన ఆంధ్రులకు జాతీయపర్వవారమని చెప్పనొప్పును. అహో! ఎన్నిసభలు! ఎందఱుజనులు! ఏమికోలాహలము! ఎంతయుత్సాహము! వర్ణనాతీతముగదా! కల్పలతా! అమ్మహోత్సవము చూచిన తరువాత నిజముగా నక్కడి కేగుటయు, కనుటయు, వినుటయు మహాభాగ్యమే యనుకొంటిని.
మేము బెజవాడలో 2 - 11 - 29. తేదీని రైలుదిగునప్పటికి స్త్రీ లిరువురు మాకెదురుపడి యొక కరపత్రమొసగి తామేర్పాటుచేసిన బసకు రావలసినదని యాహ్వానించిరి. మా కీయూరబంధువులు గలరు. కాన వారియింటికేగి సభకు హాజరు కాగలమని వాక్రుచ్చితిమి. వారు సరేయని విడిచి పుచ్చిరి. తరువాత వారొసంగిన కరపత్రమును చూచితిమి. మఱునాడు ప్రత్యూషముననే మహిళాసభ ప్రారంభమని అందుండెను. ఆహ్వానసంఘమువారు సభలవిషయమై స్థిరమగు తేదీని ప్రచురింపరైరి. ఎట్లు వెళ్లుదునని తహతహలాడి