Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

శారదలేఖలు

కాని విచారించిచూడ నా ఆశ్చర్యము పొరఁబాటే! ఏలనందువా? ఈ బిరుదులు మన దేశమునకు క్రొత్తలుగావు. రాజులకు, రాణులకు, మంత్రులకు, సేనాపతులకు, కవులకు, గాయకులకు, పండితులకు, మల్లులకు, శిల్పులకు వేయేల ప్రజ్ఞాచణులైనవారి కెల్లరకు కడుదీర్ఘములైన బిరుదావళులున్నట్లు ప్రాచీన శిలాశాసనములును, గ్రంథములును చాటుచున్నవి. ముఖ్యముగా సుప్రసిద్ధులగు మన ప్రాచీనకవివరేణ్యులలో బిరుదుపదములు లేనివారే లేరు. ఆదికవియైన నన్నయభట్టు వాగనుశాసనుడను బిరుదుపొందెను. ఆరణ్యపర్వశేషపూరణము గావించిన యెఱ్ఱనార్యునకు ప్రబంధ పరమేశ్వరుడను బిరుదుగలదు. తక్కుంగల భారతమును రచియించిన తిక్కయజ్వ కవిబ్రహ్మ యని వినుతిబొందెను. మనుచరిత్ర కావ్యకర్తయైన అల్లసాని పెద్దన ఆంధ్రకవితాపితామహుఁడను బిరుదము నందెను. రమణీయమంజులకవిత కధినాధుండైన శ్రీనాధుండు కవిసార్వభౌముండను బిరుదును బడసెను. ఇఁక కృష్ణదేవరాయాది రాజేంద్రులకును, తిమ్మరుసు మున్నగు మంత్రిసత్తములకును, తదితర రాజకీయోద్యోగులకునుగల బిరుదావళులకు లెక్కయేలేదు. ఇప్పటికిని మన దేశమునందలి సంస్థానాధిపతుల పేరులు చూచిన మన పూర్వులకు బిరుదావళులపై మోహ మెంతగానుండెడిదో విశదమగును.

అలనాటినుండియు మనవారికి ఉండిన బిరుదులపై వాంఛ నేడును మనవారిని వీడదుగదా! ఈ బిరుదులు పలు