శారదలేఖలు
119
విధములు. పాండిత్యమునకు మెచ్చి ఈయబడెడివి కొన్ని. ప్రజ్ఞకు సంతసించి యిచ్చెడివి కొన్ని. ఈ బిరుదములను కొన్నిటిని ప్రజలొసంగుదురు. కొన్నిటిని యేవేని విద్యాపీఠములో జాతీయసంస్థలో పరిషత్తులో యొసంగును.
మన దేశమం దసహాయోద్యమము బయలు వెడలిన తరువాత దేశీయులు బహిష్కరింపవలసినవాటిలో ప్రభుత్వపు బిరుదములుగూడ నొకటిగాఁ జేర్పబడినవి. అప్పటినుండి ప్రభుత్వబిరుదములు పలుకుబడి చాలవఱకు సన్నగిల్లినది. మఱియు వానిపై నొకవిధమగు నిరసనభావముగూడ నేర్పడినది. నిరాకరణోద్యమము విస్తరించియున్న యాదినములలో పలువురు పూర్వదత్తబిరుదములను విసర్జించి ప్రజల పొగడ్తల బడసిరి. "బిరుదుపదవులను బురదలో దిగబడి" దేశమును దాస్యములో ముంచకుడని జాతీయాత్మగల కవులు గానము చేసిరి. ఈవిధముగా దొరతనపు సన్నదులపై మోహము జనులకు తొలగింపఁబడినను బిరుదులపై మోహముమాత్రము జనులకు పూర్తిగా వదలలేదు. దొరతనమువారి రావు సాహేబు, రావు, రాయ, దివాన్ బహద్దూర్, సర్ ఇత్యాది బిరుదులపై పోటీకి వచ్చినవో యనినట్లు దేశభక్త, దేశబంధు, దేశోద్ధారక మున్నగు బిరుదులు దేశసేవపరాయణుల పూజ్యనామములకు తగిలించి పిలుచుట అసహాయోద్యమ కాలమునుండి పరిపాటిగానున్నది. దేశపూజ్యులైనవారికి నిండుప్రేమతో ప్రజలొసంగెడి దేశభక్తాది బిరుదములు మాన్య