116
శారదలేఖలు
రింపరాని యట్టి వృత్తాంతము లిప్పుడు విధ్యాధికుల లేఖనీ సన్మానమునందుచు రమణీయకథలై పత్రికలలో పొత్తములలో నెక్కుచున్నవి. ఆహా! కాలమహిమ !
కథ అచ్చుపడి దేశములో ప్రవేశించిన తరువాత అవివాహితయైన బాలిక చదువును. అన్నెపున్నెము లెఱుగని బాలవితంతువు చదువును. సత్యనురక్తయగు నిల్లాలు చదువును. వైరాగ్యోదయమైన వృద్ధురాలు చదువును. అట్లే పురుషులలో గూడ విద్యార్థులు మున్నగు పలురకములవారు చదువుదురు. అందఱు చదువుట కర్హమైనదిగా నుండవలయుట కథారచయితల ముఖ్యధర్మమై యున్నది. కథకులేగాక కథకురాండ్రుగూడ యిట్టి కథలను వ్రాయ సాహసించుచున్నారు. దైవము వీరికి మంచి త్రోవను చూపుగాక.
కల్పలతా! యోచింప, యోచింప, భావకవులనబడెడి వారేదియో యొక ఆడపేరు బట్టుకొని 'ప్రేయసీ! ప్రేయసీ' యని యల్లాడుటయు, కథకులైనవారు 'ప్రేమప్రేమ’యనుచు స్త్రీలనుగూర్చి యిట్టి విపరీతపు అసమంజసపు గాథలల్లుటయు, జూడ ఆంధ్రభాష దురదృష్టమో ఆంధ్రస్త్రీల దురదృష్టమో యోచింపలేకున్నాను.
భావపురి
ఇట్లు
ఆగస్టు 1928
శారద.