శారదలేఖలు
115
నాకు మాటిమాటికి స్ఫురణకు వచ్చుచు అంధకారపథమున దీపకళికవోలెతోచి నాకర్తవ్యతాపథమును నిరూపింపుచుండును. ఇతరకథలను చదివినప్పుడు గూడ ఆకథలు పైవాక్యమునకు సరిపడియున్న వాయని యోచించుట నాకు పరిపాటి. సమదర్శినీ సంచికలోని కథలను జదివిగూడ నే నిట్టులనేయోచించితిని. రెడ్డిరంగమ్మ యెడ్డెతనపుగాథను జదివి అసభ్యము, అసాధారణము అని మనస్సున చీకాకుపడి, సావిత్రి యను చల్లనిపేరుగాంచి యీకథయైన మనశ్శాంతి నీయకపోదని కుతూహముతో జదివితిని. మొదటికథకంటె నధ్వాన్నముగ నున్నదీ కథ. “మాప్రణయగాథ” సరేసరి. అన్నిటికంటె గొడవగానున్నది అమ్మడు గొడవ. సమదర్శినీపత్రికాధిపతులు తమ సమదర్శకత్వమును తేటపఱచుటకై హితాహితములను గమనింపక యిట్టి కథలకు తావొసంగి రనుకొందము. కాని వ్రాసినవా రివి యెందులకు వ్రాసిరి? ఆకథలు తల్లి, బిడ్డకు చదివి వినిపింప దగినవికావు. బిడ్డ తండ్రికి చదివి వినిపింప దగినవికావు. సోదరుఁడు తోబుట్టువు నాకథలను జదువుమని చెప్ప సాహసింపజాలడు. స్నేహితుఁడు ఒకస్నేహితునిముంద రాకథలను సిగ్గువిడిచి చదువజాలడు. తుదకు అగ్నిసాక్షిగా పెండ్లాడిన ఆలుమగలు కాదుగదా కూరిమికిగూడిన స్త్రీపురుషులైన ఆకథలను జదివి మోదింపజాలరు. సావిత్రివంటి, రెడ్డి రంగమ్మవంటి, పనికిమాలిన స్త్రీలెచ్చటైన నున్నచో వారిని గూర్చి బహిరంగముగా జెప్పుకొనుటకే యోగ్యులైన వారు పూర్వము జడియువారు. మనసున తలపరాని వాక్కున నుచ్చ