Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

శారదలేఖలు

దలంచెడి ప్రభుత్వములో ప్రజల కింతకంటె సౌకర్య మెట్లు గలుగును? ఇందువలన పేదజను లనుభవించుచున్న కష్ట మనంతము. అయితే ప్రభుత్వమువారది గుర్తించుటలేదు. ఈ సందర్భమున నొక చిన్న స్వానుభవము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. పూర్వము మాయింట్లో ఒక పనిమనిషి యుండెడిది. ఆమనిషి నన్నొక ఉత్తరము వ్రాసిపెట్టుమని యొక తెల్లకాగితమును తెచ్చి నాకిచ్చెను. కవరేదీ అని నే నంటిని. “కవరక్కర్లేదు. కవరుమీద వ్రాస్తే మా ఉత్తరాలు చేరవు. బంట్రోతులు పాఱేస్తారు. నటుపేటుత్తరమైతే చేరుద్ది" అనినది. అణాకు రెండణాలు యిచ్చుకోవలసి వస్తుందిగా అన్నాను. "అవును ఆళ్లకు మేమేశినా మా కాళ్లేశినా మాఉత్తరాలు యింతే. రెండణాలు ఇచ్చుకుండేదే. పూరబం మాపిల్లగాడు పుట్టకమునుపు అణాయిచ్చి ఉత్తరం తీసుకొనేవాళ్లం. ఇప్పుడు బేడ యిచ్చి తీసుకుంటున్నాము” అనినది. ఉత్తరమువ్రాసి యిచ్చితిని. రెండుమూడుదినములకు చిరునామాదారుడు ఊళ్లో లేడని ఆ ఉత్తరము తిరిగివచ్చెను. నట్‌పేటుత్తరమైనందులకు రెండణాలు అది మరల తిరిగివచ్చినందుల కొక అణా మూడు అణాలు వసూలుచేసినాడు పోస్టుజవాను. అడబ్బులు దగ్గర లేక చెంబు తాకట్టుపెట్టిమూడు అణాలు యిచ్చినానని ఆదాసీది నాతో చెప్పి మొత్తుకొనెను. పోస్టలురేట్లు పెరిగి నందువలన పాపము పేదజను లెంత గోడుపడుచున్నారని నాకు మహావిచారము గలిగెను. శ్రీమంతులకు లక్ష్యములేక పోవచ్చును. కాని దినమునకు నాలుగణాలు కూలి తెచ్చుకొని