శారదలేఖలు
93
లచే చేయబడిన రంగురంగుల వాహనములు గూడ గలవు. రంగులతో వేయబడిన బొమ్మలు గోడలపై నేవంకజూచినను డాబుగా గన్పట్టినవి. తిరువాన్కూరురాజ్యములోని ప్రతి ఆలయము ప్రత్యేకలక్షణములతో నొకేనిర్మాణపుఫక్కిలో నుండ ఆరాజ్యములోనిదేయగు నీయాలయము ద్రావిడాలయముల పగిది నుండుటేలనో తెలియదు. శుచీంద్రములో స్వామిని దర్శించిన వెనుకనే సత్రములోనికి వచ్చి వంటజేసికొని భుజించితిమి. వెంటనే బయలుదేరి నాగర్‌కోయిల మీదుగా తిరునల్వేలి వెళ్లవలె ననెడి యుద్దేశముతో బస్సుకొఱకు ఎదురుజూచుచు సత్రపువాకిట గూర్చుంటిమి. ఇంతలో యెవరో కార్డులు చేతబట్టుకొని సత్రపుటరుగులపై వచ్చి కూర్చుండిరి. అవి అచ్చముగ మనకార్డులవలెనే యుండెను. కాని మనవి మాత్రము కావు. అవి తిరువాన్కూరురాజ్యపుకార్డులు. వానివెల కడు స్వల్పము. చక్రమునకు మూడు కార్డులు. అనగా ఒక్కొక్క దాని వెల యించుమించు రెండు దమ్మిడీలు. ఆకార్డులారాజ్యమునందు మాత్రమే చలామణీ యగును, బ్రిటిషుయిండియాకు వ్రాయవలెనన్నచో మనకార్డులనే యుపయోగించవలెను. స్వతంత్రరాజ్యములోని సౌకర్యములట్టివి. చూడుము! ఎంత చౌకగా నమ్ముచున్నారో! ఐరోపాసంగ్రామసందర్భమున మన గవర్నమెంటువారికి ధనలోప మేర్పడి కానీకార్డును అర్థణాచేసినారు. యుద్ధము ముగిసి ఎంతకాలమో అయినది. ప్రభుత్వము పూడుకొనినది. కాని కార్డుధర అట్లేయున్నది. ప్రజాసౌకర్యముకన్న ప్రభుత్వకోశమును నిండించుకొనుటయే యుత్కృష్టముగా