Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

శారదలేఖలు

తుండ్లను నడుములకుకట్టుకొని దీర్ఘములైన వినీలశిరోజములను విరియబోసికొని యధేచ్ఛముగా స్నానముచేయుచుండిరి. పైట వేసికొననందులకు వారేమాత్రము బిడియపడుటలేదు. కాన వారి కావిషయమై యంతగా పట్టుదలలేదని యనుకొంటిమి. తమిళకేరళ రాష్ట్రములు సన్నిహితములైనను తమిళస్త్రీలకును కేరళస్త్రీలకును బహువ్యత్యాసమున్నది. తమిళస్త్రీలు తెల్లచీరలుకట్టరు. మళయాళస్త్రీలు రంగువస్త్రములను ధరింపరు. తమిళస్త్రీలు సాధారణముగా కొప్పుపెట్టుకొందురు. లేదా జడవేసికొనియెదరు. కేరళకాంతలు చక్కగా జారుముడి వైచుకొందురు. తమిళస్త్రీల కర్ణాభరణములు బహుబాధాకరములైనవి. మఱియు నందచందములేని మొఱటుదిమ్మెలు. ఆదిమ్మెలను వారు గుత్తులుగాజేర్చి చెవులకు వ్రేలాడవేసికొందురు. ఆనగల భారముచేత వారిచెవితమ్మెలు రబ్బరుత్రాడులవలె సాగిసాగి భుజములనంటు చుండును. ముందెప్పుడో పసిడిసొమ్ములు పెట్టుకొనుటకై వారు తమ కొమార్తెలకు పసితనముననే చెవులుకుట్టి కంచుమెట్టెలను సీసపుమెట్టెలను రెండు మూడు గుదిగ్రుచ్చి చెవులకుతగిలింతురు. ఆ లోహభారముచేత బాలికల లేతతమ్మెలు సాగి యూగులాడుచుండును. అనాగరకమును నత్యంత బాధాకరమును నైన నాయలంకారము జూడంజూడ తమిళిదేశమున బాలికయైపుట్టుట పాతక హేతువనిపించినది. మళయాళ స్త్రీలకట్టి కర్ణాభరణములులేవు. ఒకానొకరికున్నను సాధారణముగా చిన్నపాటి చెవికమ్మమాత్రమే. తమిళస్త్రీలు పొగాకునుజేర్చి యధికముగా వక్కాకు నమలు