శారదలేఖలు
87
చుందురు. కాన వారి పెదవులును దంతములును నెఱ్ఱని గారగట్టి అసహ్యముగానుండును. మఱియు వారు కూర్చున్న చోటెల్ల నెఱ్ఱనియుమ్ములతో నశౌచపఱతురు. కేరళస్త్రీలకట్టి దురభ్యాసమున్నట్లు కానము. కావున సహజమైనదంత ధవళిమయు నధరరక్తిమయు వారి వదనారవిందములకు చెలువు గూర్చుచుండును. వేయేల, తమిళమళయాళస్త్రీల యాకారములే భిన్నములు. తమిళస్త్రీలు అవయవములు పొందిక లేక హెచ్చుతగ్గులుగానుండి అనాకారలుగా గాన్పింతురు. కేరళస్త్రీలు చక్కని యవయవస్ఫూర్తిగలిగి విశాలములును ప్రసన్నములునునైన ముఖారవిందములతో రూపవతులుగా గాన్పింతురు. దక్షిణ హిందూదేశమున గల ద్రవిడకర్ణాటాంధ్రకేరళాది దేశపు స్త్రీలలోకెల్ల కేరళస్త్రీలే చక్కనివారని చెప్పుదురు. వారిని చూచుటతోడనే ఆమాటనిజమని ఋజువయ్యెను.
అన్యప్రసంగములకు బోయి ప్రస్తుతాంశమునకు దూరమైతిమి. సఖీ! మేమట్లు జనార్ధనస్వామిని సేవించి మాబసకేతెంచి భోజనాదులు గావించుకొని వెంటనే స్టేషనునకువచ్చి అనంతశయమున కేగు రైలునెక్కితిమి. మనము అనంతశయనమను దానినే అచ్చటివారు తిరువనంతపురమనియు ట్రివేండ్రమనియు అందురు. తిరువనంతపురము తిరువాన్కూరు రాజ్యమునకు ముఖ్యపట్టణము. అచ్చటనే సుప్రసిద్ధమైన అనంత పద్మనాభస్వామివారి ఆలయముగలదు. మేము రైలుదిగి యూరిలోనికివెళ్ళి సత్రములో మా మూటముల్లెలు పెట్టుకొని