శారదలేఖలు
85
పుగా పలకలుతీర్చి యున్నవి. ఆదేశపు దేవాలయములవలెనే యచ్చటి స్త్రీలుకూడ నిరస్తభూషలు. మళయాళస్త్రీలు సాధారణముగా నగలు ధరింపరు. రంగువస్త్రములను కట్టరు. అయినను విలక్షణమైన ఆకృతియు దీర్ఘములైన శిరోజములును వారికి సహజముగనే లభించి వారిని రూపవతులనుగా జేసినవి. దానికితోడు శుభ్రమైన ధవళవస్త్రధారణమువారి సౌందర్యము నినుమడింపజేసెనని చెప్పనగును. మళయాళస్త్రీల వస్త్రధారణముకూడ మన కక్కజముగనే యుండును. అచ్చట స్త్రీపురుషులొకే విధముగా వస్త్రముల ధరింతురు. తూర్పునకు (గంజాము విశాఖపట్టణ ప్రాంతములకు) పోయినకొలది స్త్రీల కట్టుబట్ట తొమ్మిదిమూరలే. అటనుండి క్రమముగా దక్షిణమునకు వచ్చినకొలది స్త్రీలచీరలొక్కొక్కమూరపెరిగి పూర్తిగా దక్షిణమునకు వచ్చునప్పటికి యిరువదిమూరలగును. కాని కేరళస్త్రీల కట్టుబట్ట పురుషుని కట్టుబట్టవోలె నాఱుమూరలే. ఆధోవతిని వారు నడిమికిమడిచి దాక్షిణాత్యపురుషులవలెగూడ కట్టుగా కట్టుకొని దానిపై నొక చిన్న తుండుగుడ్డను వల్లెవాటుగా భుజముపై వేసికొని యొకకొంగును మొలలో దోపుకుందురు. రవికకుమాఱుగా నఱచేతులచొక్కా వేసికొందురు. ఈ పై తుండును వారు బయటికి వచ్చునప్పుడు మాత్రమే యుపయోగింతురని తోచెడిని. ఊర్ధ్వభాగమును కప్పుటకు వారంతగా బ్రయత్నింపరు పైట లేకపోవుట వారి కొకయాక్షేపణీయ విషయముగాదు. మేమువిడిసిన సత్రమునకు ప్రక్కగానున్న కోనేరులో దేవకన్యలనుబోలిన యువతులు కొందఱు చిన్న