పుట:Saptamaidvardu-Charitramu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

సప్తమైడ్వెర్డు చరిత్రము


సానికిని, సుస్వాగత మిచ్చి, వారి మెడలోఁ బూలడండలు వైచి, మిక్కిలి సంభావించిరి. ఎడ్వర్డును, ఆ లెగ్జాండ్రాయును, మున్నగువారు, అలెగ్జాండ్రా పురిని విడిచి కై రోపట్టణమునకు వెళ్లిరి.

అచ్చట నాంగ్లేయ రాజప్రతినిధి యెల్లప్పుడును ఉండును. అతఁడును, అతని పరివారమును, ఇంకను ఆచోట నుండు దొడ్డ వారును, ఎడ్వర్ణ లెగ్జాండ్రులను సందర్శించి వారి రాక చేదమదేశమును, దమజనులును, ధన్యులై రని మనంబున నూహించి, ఆ 'రాజదంపతులకు సకల మర్యాదలను సలిపిరి. ఎడ్వర్డ లెగ్జాండ్రులు విడియుటకు దిన్య మైన యొక సగరు విడిచి యు డెను. అది సర్వభంగుల నలంకృతమై చూపరుల కనుల పండువు సేయు చుండెను. దానిలోని గదులు విశాలము లై రమణీయము లై యొప్పారుచుండెను. దానిలో నవరత్న ఖచిత ములైన హేమపాత్రంబులు ఆయాచోటులందు నమరిసొంపు పెంపు పెరుఁగు చుండెను. ఆంగ్లేయుల ప్రభువులకువలయు సుపకరణము లాతావున సమృద్ధిగా విరాజల్లుచుండెను.

ఈజిప్టు వైసురాయితల్లి పిబ్రవరి నెల 5వ తేదీ అలె గ్రౌండ్రామహారాని, ఆమె చెలికత్తియలకును, గొప్పవిందుఁ జేసెను, విశాలములైన బల్ల లమీఁద నవరత్న ఖచితము లైనవియును, స్వర్ణ రజిత మయములైనవియును, అగు గిన్నెలలోను, తట్టలలోను, చిన్న చిన్న పాత్రములలోను, నానా విధములైన భోజ్య వస్తువులు నిండియుండెను. ఇంగ్లండులో నెప్పుడును లభిం .