పుట:Saptamaidvardu-Charitramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

85


ఆమెప్రీతీకిఁ బాత్రు డాయెను.

ఎడ్వెర్డ లెగ్జాండ్రులు, ఈజిప్టు రాజ్యమును జూడఁబోవుట.

ఎడ్వెర్డు తన పెండ్లికి ముందు, అమెరికాలోని కన్నడా మొదలగు రాజ్యములను జూచి వచ్చెను. వివాహ మైన పిదప నాలి తోడ నాతడు ఈజిప్టు రాజ్యమును జూచి రావలయు నని తన తల్లితో నాలో చించెను. వుత్త్రులకోరిక నెఱవేర్చుట తల్లులకుఁ బ్రియము కదా ! రాణి "ఏడ్వర్డు ఈజిప్టు: జూడవలయు సని కోరి యున్నాడు. చిన్న వానికిఁ గావలసిన ప్రయాణ సన్నాహములఁ గావింపుఁడు." అని మంత్రులకు నాజ్ఞ సలుప వారలు ఎడ్వెర్డాజ్యముల: జూచి నచ్చుటకు సమ్మతించి సర్వయత్నములు సలిపిరి,

ఎడ్వర్లును, ఆతనిపత్ని యైన అలెగ్జాండ్రాయును, పరివారమును, 1869 సం. జనవరి నెల 15 వ తేనిని ఈజిప్టు దేశమునకు బ్రయాణ మైరి. వారి వెంట బాటన్బరు రాకొమారుఁ డైన "లూ యి" అనునాతడును, (Prince Louis of Battenberg.) సదెర్లాండు భూస్వామియును, (The Duke of Sutherland) డాక్టరు డబ్లీయు రస్సలును, (Dr. K. H. Russel.) వారిపరి జనంబులును, ఎడ్వర్డ్ లెగ్జాండ్రుల వెంటఁ జనుందెంచిరి.

ఎడ్వెర్డు మొదలుగాఁ గలవారు ఫిబ్రవరి నెల 8 వతాలున నైలు ముఖ ద్వారంబుననుండు న లెగ్జాండ్రా పట్టణమున నోడదిగిరి. ఆపురంబున నుండు నాంగ్లేయులు తమ ప్రభువునకును, ఏలిక