పుట:Saptamaidvardu-Charitramu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

సప్తమైడ్వెర్డు చరిత్రము


మార్చి నెల 31న తారీకునఁ డర్కీలో మధ్యధరాసముద్రము, దరి నుండు "జఫా" అను రేవు పట్టణమున ఎడ్వర్డు ఓడదిగెను టర్కీ రాజ్యమందలి యుద్ధ వీరులు సాయుధు లై ఎడ్వర్డునకు దారి చూప సాయపడిరి. ఆల్బర్టు బిడ్డఁడు జెరూసులమును, దానికి నలుగడల నుండు రమ్యప్రదేశంబులను, కొండచరియలలోఁ బ్రవహించు సెలయేళ్ల మొత్తంబులను, గాంచి ప్రమోద బరితొంతుండయ్యె. అతను జూడియా మలలమీఁదుగ " బెతలు” మను పట్టణమును జూచి, " జెరీకో" (Jerichoy అను నడవులలోఁ గొంత కాలము గుమ్మరి, బతని" కి వెళ్లి, అచ్చట నుండు నందంపు, దాపులఁ గని, మాక్పెలా (Machepela) అను గుహలోని వింతల బోడగాంచి ఆచ్చెరువొంది, ఆదేశమును వదలి తన రాజ్యమునకుఁ గ్రమ్మఱ నేతెంచెను. డాక్టరు స్టాన్లీ తానింతకుఁ బూర్వ మాపాలెస్టెను 'రాజ్యమునకువెళ్ళి యుండుపుడు చూడ లేనట్టి తావుల నన్నింటిని ఎడ్వడుర్డు వెంటఁ బయనము సేయుటచే జూడఁ గలిగినందులకు మిక్కిలి సంతోషించి, ఎడ్వర్డును బరి విధంబులఁ బ్రశంసించెను.

ఎడ్వర్డు ఇల్లు సేరగానే, “హీన్" అను రాజ్యము యొక్క "రాజపుత్రుడైన 'లూయి” కి నాయన చెల్లెలైన ప్రిన్సు అలిస్పను నామెను ఇచ్చి వివాహము నడిచెను. ఎడ్వర్డు తాను తూర్పు దేశంబునుండి తీసికొని వచ్చిన వింత వింత సామానులను,అపూర్వ పుష్పవర్గంబులను, తనతో బుట్టువునకు సజరుగ నిచ్చి