పుట:Saptamaidvardu-Charitramu.pdf/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

87


పని ఫలసముదాయంబులును, పరిమళో పేతంబు లైన పుష్పప్రకరంబులును, పఱిచి యుండెను. వైసురాయితల్లి ఆలెగ్జాండ్రా ప్రభృతులను గౌరవించి, పైనఁ జెప్పిన భోజ్య వస్తువుల గుడువ వేడెను. ఆ యేడ్వర్డు గృహిణి, మున్నగువారు బల్లల ముందర గూర్చుండి ఆహారమును భుజింప నారంభించిరి. వెలయాండ్రు నృత్యము సలిపిరి, పాటకులు గానము సేసిరి . గారడి విద్య వాడ్రు గారడిని ఒనర్చిరి. భోజన సమయమున నిట్లు జరుగుట నా యింగ్లండు రాణీ కోడలుగాంచి, ప్రమోదాశ్చర్యంబుల నందెను.

ఎడ్వర్డును, ఆ లెగ్జాండ్రాను, వారి నెంట నింగ్లండునుండి ఏతెంచిన వారలును, నైలునదిలోనే దానిజన్మ స్థలము వరకుఁ బయనము సేయఁ గోరిరి. తురక లనేకులు మెక్కాలో మహమ్మ దుగోరి మీఁదఁ గప్పుటకై చిత్రపుఁ గంబళ్లను రెంటిని దీసికొని నెళ్లుటను, ఆరాచబాటసారులు గాంచి, ఫిబ్రవరి నెల 6 వ తేదిని నైలు నదిలో వారలఁ గొనిపోవు నోడ ఆయతంబై యుండ దాని నారోహించి దారి సాగ జనుచుండిరి.

ఎడ్వర్డును, అలెగ్జాండ్రాయును, ఒక యోడ లో నుండి, అందు వారికి స్నానార్ధమై ఒక గదియును, నిదుర పోవుటకు వేరొక అరయును, ఉడుపులు ధరించుకొనుటకు కొండొక కొట్టును, కచ్చేరి సేయుటకు నింకొక గదియును ఉండెను. ఈ యోడలో నారు భోజనము సేయుట లేదు. రెండన నావ, మొదటి దానివెంట వచ్చుచుండెను. అందు నల్గు ఫ్రెంచి దేశస్థులైన