పుట:Saptamaidvardu-Charitramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

సప్తమైడ్వెర్డు చరిత్రము


హార్వర్డుకళాశాలను బొడగాంచి, కడపట బంకర్సుకొండనుజేరెను.

ఎడ్వర్డు అమెరికా దేశమును విడిచి, నావలో బయసము "నేసి, ఇంగ్లడును: జేరి పెద్ద కాలము తన్ను నెడబాసిన వ్యధచే సనయు తల్లిదండ్రుల సంతోపరిచి సుఖంబున నుండె.

ఎడ్వర్డు తూర్పు రాజ్యములఁ జూచుటకు వేఁగుట,

1861 సం. న ఎడ్వర్థుతండ్రి పరలోకగతుఁ డయ్యె. ఆతడు తండ్రి చావున కై మిగుల దుఃఖంచి, రాచ కార్యములు

సేయక ఏవేళఁ దన నాయననే తలంచు చుండెను. మంత్రులు ఎడ్వర్డ న్య దేశములలోఁ ద్రిమ్మరు నేని శోకముపశమించునని ఆలోచించి అతనిని తూర్పు రాజ్యంబులకు ననుపుట మేలని విక్టోరి యాతో జెప్పిరి. ఆమెయును దానికి సంగీకరించెను. ఎడ్వర్డు నాకోరిక మేరకు నాదేశములఁ గని వచ్చుటకు నియ్యకొనెను.

1862 సం. ఫిబ్రవరి నెల 28 న తేది ఎడ్వర్డు పరిజనులనేకులు తన వెంటఁ జను దేరఁ దూర్పు రాష్ట్రములకు నేఁగఁబయన మయ్యె. జనరల్ బ్రూసు, (General Bruce) మేజర్ టీస్ వేల్' (General Teesitate) కాష్టన్ కెప్పల్ (Captain-Keppet) స్టాన్లీ (Dr.Stanley) ఎడ్వర్లు వెంట నంటినడిచి, ప్రయాణీకులు ఈజిప్టు రాజ్యమునకు ముఖ్య పట్టణ మైనకై రోకు బోవుటకుఁ దర్లిరి.

ఎడ్వర్డు ప్రభృతులు కైరో పురంబుఁ బ్రవేశించి అందలి