పుట:Saptamaidvardu-Charitramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

88


వింతలను బొడఁగాంచి విస్మితులై నైలు నదిలో బయనము సేయుచుండిరి.... ఎడ్వర్డు దైవభ క్తిసంపన్ను దైనందున ఆదివారమగుటచేఁ బక్షులను జంప నొల్లఁడయ్యె. ఏటికి నిరువైపుల నుండుగట్టులపై శకుంతలసంతానముల కిలకిలారవములు చెవులకు విందొనర్చు చుండె. నదిలో నొక చాయఁ దామరలు వికసింప. నాతావులను బుడుత తెమ్మెరలు ఇంగ్లండు రాణి కొడుకు పైఁజల్లు చుండెను. తెల్లని బాతులు నీటిమీఁద నెడ్వర్డు నెదురుకొనుట కై వచ్చుచుండె నను విదంబున నీఁదు చుండె. రాణి తనయండు వానిలో నొక దాని నైనను చుంపక దేవుని స్మరియిం చుచు నదిలో బయనము సేసె. అతని మొసలిని వేటాడివలయునని ఎంతఁగోరినను, ఒక మొసలి యైనను నీటిమీదం గనుపడ దయ్యె.

ఎడ్వర్డుర్టును, ఆయన. పరిజనులును, డాక్ట రు స్టాన్లి మొదలగు పండిత సమూహబులును, నైలుముఖ ద్వారంబున నుండు అలెగ్జాండ్రి" అను రేవు పట్టణమును ", అచ్చటనుండి మధ్య ధరాసముద్రము పై నావ యాత్రసలిపి, క్రైస్తవ మతోద్ద్రారకుడైన జీసస్ క్రైస్టు జన్మభూమి యగు పొలెస్టైన్ బ్రవేశించిరి.

మొదటి ఎడ్వర్డును, ఎలినారును పూర్వ మాచోటికి వెళ్లి యుండిరి. కాని వెనుక నింగ్లండు 'నేలిన ప్రభువర్గములో నేరును ఆ తావును మొట్టి యుండ లేదు. "మొదటి ఎడ్వర్డు రాజ్య మేలి దాదాపు. ఏడువందల యేండ్లయ్యె.