పుట:Saptamaidvardu-Charitramu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ రవయధ్యాయము.

81


డీ బానిస గుంపులను జూడ బోవునా? అయినను న్యూ కాజల్ ప్రభువు, ఈవిషయమై దీర్ఘము నాలోచించి సంయుక్త రాష్ట్రపు దక్షిణమాగాణములను జూచి వచ్చుటకు రమ్మని ఎడ్వర్డును పిలి చెను. అతడు తన క్షేమము కోరిన: అతని ప్రార్థనకు విరోధముగఁ బోనొల్లక ఆమాగాణములఁ జూచి వచ్చుటకుఁ దర్లి బానిసలు లేని తావు లన్నింటిని జూచి వాషింగ్టనుకు వచ్చెను.

ఎడ్వర్డు వాషషింగ్టను నుండి ఫీలవాలియా అనుషట్టణముసకు నేతెంచెను. అచ్చట నుండు ఇండి పెండెన్సుహాలు నాతడు గాంచి, 'పుర్వము తన తాతకు లోబడిస జనులు స్వాతంత్య్ర మును పొందిన తావదే అని కొంతకాల మచ్చట సూరకుండి ..తసభావము నెరులకు దెలియనియ్యక యాతావు వాసి న్యూయార్కునకుఁ జనుదెంచెను. అచ్చట నాతఁడు సేరగానే, ఆ పుర వాసులు అతనిఁ గాంచి మిక్కిలి సంతోషపడిరి. ఫాదర్నికర్ బాకర్ (Father Knickerbocher) అనునాతండు ఎడ్వర్డునకు సగౌరవ స్వాగత మిచ్చి, ఆతని హోదాకుఁ దగిన విడిది సూపి, ఆయనకు విందొనర్చెను. ఆందు ననేకులు వచ్చిరి. పెక్కుమంది తావు లేనందుచే రాలేక పోయిరి.. అపురమున నెడ్వెర్డైదురోజులుండెను. ఆతఁడా తావును విడిచి ఆల్బని, బోస్టను, అనుపురం బుల జూచి, లాంగ్ ఫెలో, ఆలివర్ వెండల్ హోమ్సు, ఎమర్సను, ము న్నగు గొప్పకవీశ్వరులు గాంచి, వారితో గొంత కాలము విద్వత్స సంగములు సేసి,