పుట:Saptamaidvardu-Charitramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

సప్తమైడ్వెర్డు చరిత్రము


జాను లోని ప్రజలు గుంపులు గూడి ఎడ్వర్డును గనుటకు విచ్చేసి యుండిరి.. వా రాతనిఁ గాంచి, చేతులు కట్టి, అ నేక భంగుల నా తనిఁ జూచి నందునఁ దమకుఁ గలిగిన యానందంబును దెలియఁ బరచిరి.

ఎడ్వెర్డు కన్నడారాజ్యముఁ బ్రవేశించెను. అందలి జనులాతనిరాకకై చాతక పక్షి మేఘముల రాకకై వేచి యుండు విధంబున నిరీక్షించు చుండిరి. అతడారాష్ట్రమునఁ బయనము సేసిన చోటులం దతట నెచ్చటం గాంచినను, వేన వేల జనులు క్రిక్కి రిసి ఆయన ముఖ కమలమునుఁ జూడ బై పయింబడు చుండిరి. పట్టణంబులలో రాజమార్గంబులు పచ్చని తోరణంబు లచే లకరింప బడుట సహజము. ఒక యూరినుండి ఇంకొక యూరికి నాతఁడు వెళ్లిన దారులకు ఇరువంకలం బూల వృక్షులతా గృహంబులును, పచ్చని ఆకు తోరణంబులును, అమరి ఉండుట అబ్బురంబు గాదే? అవి దారి నడుచు బాటసారుల యుల్లంబుల రంజింపఁ జేయు చుండెను. అతడా దేశంబున గ్రుమ్మరు చుండి నప్పుడు రేలు పవళ్లై ద్వాదశా దిత్యులే వేళం బ్రకాశించు చురో అనుభంగిఁ గంపట్టె.

అమెరికా రాజ్యంబున నయగారాలను కొండశిఖరంబుల పై ప్రదేశంబులనుండి గంగ భూమి మీదికి మిక్కిలి లావుగాఁ బడు చుండును. అది చూడ నింపుగ నుండును. ఎడ్వర్డు దానిని జూడవలయు నని కోరెను. కన్నడ దొరతనమువారు ఆతఁ