పుట:Saptamaidvardu-Charitramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవయద్యాయము

75


తృప్తి పడురీతిని బదులు చెప్పు వలసి యుండు ననియును, వారడుగు సంగతుల స్వభావములఁ గొన్నింటి. నూహించి వాని బ్రత్యుత్తరములను వ్రాసి యిచ్చుటకును, వాని నాతనికి నేర్పు టకును, దగిన వారలాతని వెంట నేఁగుటకుఁ గొందఱు నియ మించెను.

ఎడ్వర్డును, అతని వెంటఁ బోవ నియమించిన రాజ్యతంత్ర నిపుణులును, సేనలును, ఇంక 'ననేకులును, ఆరాజ్యమునకు దరలిరి. ఓడ సముద్రము పై బిర బిర నడిచెను. వారలకు ననుకూలము గాలి వీచెను. ప్రయాణము నడుపుచుండి నపుడు ఎడ్వర్డు చిన్న వాడయ్యును, నావయాత్ర దీర్ఘ కాలము సేసిన చిరు కానందున. సముద్రమున నివసించెడి జలపక్షులను జూచు చు, సముద్ర తరంగంబుల ధ్వని విని యానందించుచు, ఇంతకుఁ బూర్వము సముద్రమునఁ బయనము సేసి యందుఁ బర్వతంబులఁ దాకి మునిగిన యోడలో నిజనంబుల దుర్మరణంబుల నాలకించి వారలయెడ దనకు గలిగిన పశ్చాంబు గనబరచుచుప్రయాణము సలిపెను. 1860 సం, న జూలై నెల 24 వ తేదిని ఎడ్వెర్డు ప్రభృతులు న్యూ ఫౌండ్లెండు దీవికి రాజధాని యైన సెంట్ జాన్" అను నగరమున నుదయమున నోడ దిగిరి. నాడాచోట వర్షము వర్షింక్షించు చుండెను. రాకుమారుడు రాఁగానే ఇంగ్లండుకు వచ్చినాడని యెం చి, సూర్యుఁడు మేఘములఁ బోఁ ద్రోచి తూర్పు మెట్ట మనోహరంబుగ వెలుంగసాగెను. సెంటు