పుట:Saptamaidvardu-Charitramu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవయద్యాయము.

77


డచ్చోటికి నెళ్లుటకు గుఱ్ఱముల నేర్పాటు సేసిరి. అతఁ డా గుఱ్ఱంబు లమీఁద నెక్కి యాతావుం జేరి, నయగారా యాకాశ గంగను జూచి విస్మయ ప్రమోదభరిత చేతస్కుం డై "ఇట్టిది ప్రపంచమున ఎక్కడనైన నుండు నే?” అని అచ్చెరు వొందు చుండెను. ఆమ సటి దినమున "బ్లోండిన్ " అను పైరుమా నొకఁడు నయగా రా నదికి నడ్డముగ గట్టి యుండిన మోకు పై నిర్భయముగ నెడ్వ ర్డు మ్రోల నడిచెను. ఎడ్వర్డ్లు వానిని గాంచి వాడు నీటఁ బడి మృతి సెందునేమో అని వెరగందు చుండెను. కాని వాడు దాని దాటి యెడ్వర్డును సమీపించెను. రాచబిడ్డ కు వానిని జూచి, “అబ్బీ ప్రాణముతో వచ్చితి వే? నీవు త్రాటి పై నడుచు చునపుడు నా మేనఁ బ్రాణములు నిలువవయ్యె, నీవెట్లుం టివో? నీ వొక వేళ నిటీలో బడి మునిగి నదీనాం సాగరోగతి?" అగుదువేమో అని శంకించితి. దేవుని కృపచే బ్రతికితివే? అం తియ చాలు.” అని వాని ధైర్యమును బ్రశంసించెను. వాడా రా కోమురుని గాంచి, అంజలిబద్దుడై “దేవ రా! ఇది యొక లక్ష్య మా? మీరు నాని వీపు నెక్కుడు, ఎంత శీఘ్ర కాలములో మిమ్ముల నావలివైపునకు మోసికొనిపోదునో కనుడు. నయగారా నది పైఁ ద్రాటిమీద నడుచుట ఎంత పాటి, మీదయ ఉండవ లెం గాక! ఇట్టియద్భుతము లైన పను లెన్న యో చేయఁగలను.” అని నుడివెను. ఎడ్వర్డు బ్లోండను పలుకులకు నలరి తన యిరవున కరుదెంచె.