పుట:Saptamaidvardu-Charitramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ యద్యాయము

69



దాని నార్పుటకు వెంటనే ప్రయత్నించెను. అతడా జ్వాలను అర్సు నపుడు, మంట అతని జుట్టుకొనెను.అతను దానిని దాటి యావలికి వచ్చినపు డాతనికిఁ గొంత చెఱుపు కలిగెను. కాని ఆయ్యది ప్రాణాపద్రవ మైనది కాదు. అచ్చట నిప్పురగులు కొనుటకు: గారణము మిద మిత్త మని ఎవ్వరును ఊహిం పలే రైరి. భగవత్కృపాకటాక్ష మహిమచే నామంట ఆరెను. ఎవరని దానివలనం జేటు కలుగ లేదు. తదాదిగ నెర్డ్వెర్డులండను నగరమున నాతావునకు నిప్పుమంటఁ జూచె నేని,అతఁడు రహస్యవర్తనంబున నాతావుకు వెళ్లి దాని నార్పు చుండెవాఁడు.

షీర్నెప్సను తావునకు నెదుట బెద్ద పొగ యోగ సూతసముగ నిర్మింతమై యుండెను. ఎడ్వర్డు దానిఁ జూచివచ్చుటకు వెళ్లెను. ఆట నుండిన యింజునియర్లు అతనిని మిక్కిలి గౌరవించి పొగయోడను నిర్మించు పద్దతిని, ఆయనకు జెప్పిరి. ఆతడాయోడ సొబగును, దానిదిట్ టతనమును, జూచి యూనందభరిత చిత్తుఁడై వచ్చెను.


విక్టోరియా తనభర్త పరలోక గతుఁ డైనది మొదలు రాచకార్యములు సేయక చింతాక్రాంతయై ఉండెను. ఎడ్వర్డును దనతండ్రి చావుచే దనకును, దనతల్లిని, కలదుఃఖమును పలు తెఱంగులఁ బలుచోటుల సమయము వచ్చినపు డంతయును వాక్రుచ్చి, అతని సద్గుణ జాలంబుల బ్రశంసించు చుండెడివాఁడు.