పుట:Saptamaidvardu-Charitramu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

సప్త మైడ్వర్డు చరిత్రము.


లుడను పురమున వైద్యాశాల ఒకటి నిర్మింపఁబడి యుండెను. కాని దాని పడమటి చాయ నొక నూతన భవనము కట్టవలసి యుండెను. ఎడ్వర్డు దానికి నస్తిభారమును వేసెను. అలెగ్జాండ్రా ఆయన వెంబడి వెళ్లి ఆ కార్యము ముగియు వఱకు నేచ్చోట నుండెను. ఆవైద్యాలయంబున, యూధులకు ప్రత్యేకముగఁ గొట్టులు ఏర్పడి యుండెను, ఆ రాజదంపతు లాయేర్పాటునకు మనంబునఁ బ్రహర్షంబు సెందిరి. ఒకనాఁడు వారిద్దరును, హైలండు భూములఁ జూడ వెళ్ళిరి.. వా తావులుగొన్నినాండ్లుండి తమపురికి మఱళి వచ్చిరి.

1865 సం. న ఎడ్వర్డు, ఆయిర్లండు లంకకు వెళ్లెను. అచ్చట నాయువ రాజు డబ్లిను నగరంబునఁ బ్రదర్శన శాలను దెఱిచెను. ఆసంవత్సరమున అలెగ్జాండ్రా చూలా లై యుండి మే నెలలో ఇప్పటి మన ప్రభు వై న జార్జిని గనెను.

వివాహ మైన పిమ్మట ఎడ్వర్డును, ఆయన భార్యయును,ఒక తావున నే నివసించు చుంట లేదు. వారు కొన్ని వేళలయందు నూరల్బరో ముదిరంబున నుండి. మరి కొన్ని సమయంబుల సాండ్రింగ్ హాము భవనంబున నుడిరి. ఒక నాటి రేయి సాండ్రింగుహాముగృహంబున దాదు లుండినగదికి నిప్పంటు కొ"నెను. ఆగదికి నగ్గి తాగుటకుఁ గొన్ని నిముసములకు ముందు, అలెగ్జా తనయిదర బిడ్డలను రెండు చంకల నిడుకొని వేరొక యరలోఁ బరుండఁ బోయెను. ఎడ్వర్లు మంటను జూచి