పుట:Saptamaidvardu-Charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా ల వ అధ్యాయము.

55


ను విని ఆమోదించెను. కాని ఇంతకన్న మిన్న యగురాచ పనులలోఁ బసితనంబున నాతఁడు ప్రవేశించి పాటుపడినది లేదు ఇంగ్లండున నీ పెండ్లివారు సమస్త కార్యంబు లొనర్చు చుండ డెన్మారు రాజ్యమునందలి ప్రజలు తమరాజువుత్రిక లోకమునం గలపృధ్వీపతులలో మేటి యని చెప్పఁ దగు నెడ్వర్డును బెండ్లియాడఁ బోవు చుండె నని మిగులసంతోషించి ఆకన్ని యకు ననేక విధంబు లగుకానుకలం దెచ్చియిచ్చిరి .అలెగ్జాండ్రా "పెండ్లికిఁ దర్లి నపుడు తనతోడఁ గూడి యాడిన బాలికామణుల పెండ్లిండ్ల కై పెద్ద రొక్కంబు నొసంగే. ఆమె వెంట బెక్కు మంది చెలికత్తియలు షయన మైరి. ఆమెను ముందు నిడుకొని సమస్తరాజు వైభవములు, నాయమ తల్లిదండ్రులుసు, ఆమె చెల్లండ్రును తమ్ములును, పెక్కు మంది పరిజనములును, వెంటరా కొనుపను హేగును వదలి ఇంగ్లండు సునకుఁ బ్రయాణాద్యుక్తు లైరి. వీరిని బరివేష్టించి సేనాసమూహములు ఆయుధపొణులై ఇంగ్లండునకు నేఁగ సమకట్టిరి .

డెనార్కు మెడయఁడు తమ నెయ్యంపు: గూఁతును వెంట నిడుకొని 1863 సం, ము ఫిబ్రవరి నెల 26 తేది:కోపను హేగనువిడిచె. పెండ్లి వారు త్రోవలో కోలో నను (Cologne)న నిలిచి.. అచ్చటనుండిన యాంగ్లేయరాజ ప్రతినిధి తమకునేలికసాని కాబోవు అలెగ్జాండ్రాను దర్శించి స్వాగతమిచ్చి పెండ్లికూతు విందొనరించెను. ఫ్లాకుడర్సు ప్రభువు విక్టోరియా