పుట:Saptamaidvardu-Charitramu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

సప్త మైడ్వర్టు చరిత్రము.


వియ్యంకుని ఆయనయనుచరులను మిక్కిలి గౌరవించి ఫ్లషింగు(Flushing) అనుతావున నాంగ్లేయుల నావల సేనాసమూహము ఆలెగ్జాండ్రా ప్రభృతులను వెంట బెట్టుకొని పోవుటకుఁ "వేచి యుండి, పెండ్లి వారిని లండనుపురిని జేర్చెను,


లండనుపురి ధేమ్సునదిగట్టున నున్నది. ఆనదిలో నెల్లప్పుడును నానాదేశ నావలు క్రిక్కిరిసి యుండును. ఎడ్వర్లు తసభావి భార్యను బిలుచుకొని వచ్చుటకు నా నదిలో మంచి యోడయుండెను. ఆదిబహుబంగుల నలంకృతమై రాజిల్లుచుండె, దాని స్తంభపుఁగొనను వ్రేలాడు జండాలు లండనుపురికి వచ్చెడి యలెగ్జాండ్రాను రమ్మని చేవీచు చుండినవో అనురీతిని గాలికి నటు నిటు గదులుచుండెను. అందునంగల యోధులు మిక్కిలి భయభ క్తులతో నాయుధపాణులై నదీతీరంబున నిలిచియుండు జను లనేకులు అలెగ్జాండ్రా ముఖారవిందమును జూడ నచ్చోటికి నేతెంచి యుండిరి. నదిలో నుండిన యేడలలోని సామానులను పురిలోనికి పోవుకూలివాడ్రు తమతమ పనులు సాలించి మోములెత్తి పెండ్లి వారువచ్చు చుండిన చాయ దృష్టి సారించి నిలువఁబడి యుండిరి. దేశీయ బాండువాద్యము “మా రాజును “మా రాజును గట్టుకొనుము. - ఇచ్చట నున్నవాఁడు. మేము మీకు ప్రథమ స్వాగతము నిటనిచ్చుచున్నారము. రమ్మా మా 'రాణి ! " అని మందలించు చుండెనో అనుభంగిని శబ్దించు చుండె.